సౌత్ సుందరీమణుల్లో నయనతారకు చాలా స్పెషాలిటీ ఉంది. మిగిలిన అందరు హీరోయిన్లు ఒకెత్తు అయితే.. ఈమె ఒక్కదాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పెర్ఫామెన్స్ లో చూపించే ట్యాలెంట్.. హిట్లు కొట్టడంలో ఉన్న రికార్డులను పక్కన పెట్టినా.. ప్రమోషన్స్ దగ్గరకొచ్చేసరికి అమ్మడి బిహేవియర్.. ఎవరికీ అర్ధం కాదు. సినిమా కంప్లీట్ చేయడంతో తన పని అయిపోయిందని.. పబ్లిసిటీల్లాంటివి చేయనని చాలా సింపుల్ గా తేల్చేస్తుంది.
హీరోయిన్స్ అందరూ టీవీల్లో తిరిగి.. పేపర్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి.. సోషల్ నెట్వర్క్ లో ప్రమోట్ చేసి నానా రకాలుగా కష్టపడుతుంటే నయన్ మాత్రం అసలు తనకేం పట్టనట్లు ఉంటుంది. ఈమె అలా ప్రవర్తిస్తున్నా ఒక్క నిర్మాత కూడా కిక్కురుమనడు. మొన్న వెంకీ మూవీ బాబు బంగారంతో పాటు.. ఇప్పుడు విక్రమ్ మూవీ ఇంకొక్కడు పరిస్థితి కూడా ఇదే. ఇంతలా బెట్టు చేస్తున్నా అందరూ నోర్మూసుకుని ఉండడానికి కారణం.. నయనతార ఐరన్ లెగ్గే అంటే నమ్మగలరా?కెరీర్ లో అన్నేసి బ్లాక్ బస్టర్స్ ఉన్న భామను ఐరన్ లెగ్ అనే ధైర్యం ఎవరూ చేయలేరు కానీ.. ఇలా సింపుల్ గా తన గురించి తానే ప్రచారం చేసేసుకుంటోంది.
తాను ప్రచారం చేస్తే సినిమా ఫెయిల్ అవుతుందని సెంటిమెంట్ అని భయపెట్టేస్తోంది. దీంతో నయన్ పబ్లిసిటీ చేయకపోయినా పర్లేదు కానీ.. సినిమా నాలుగురోజులు ఆడితే చాలు అని పారిపోతున్నారు మూవీ మేకర్స్. నయన్ లెక్క బలేగుంది కదూ. కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునేటప్పుడు.. బ్లాక్ బస్టర్స్ కొట్టి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు అందుకునేటప్పుడు అడ్డం రాని లెగ్.. ప్రచారం దగ్గర మాత్రం పుట్టుకొస్తోందన్న మాట. అలా తన లెగ్గు పేరు చెప్పి.. రోజులు లాగించేస్తోంది.