చిరంజీవిలాంటి అగ్ర కథానాయకుడి సరసన నటించే ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు? అది కూడా ఇప్పుడు తెరకెక్కుతున్నది ప్రతిష్టాత్మకమైన 150వ సినిమా కాబట్టి అందులో నటించే అవకాశం కోసం చాలామంది కథానాయికలు ఎదురు చూస్తున్నారు. చిరు ఎవరివైపు మొగ్గు చూపుతారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. కానీ ఇంతలో పలువురు కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అనుష్క అనీ, తమన్నా అని మాట్లాడుకొన్నారు. ఇప్పుడు రేసులోకి నయనతార వచ్చింది. నయనతార ఇప్పటిదాకా చిరుతో కలిసి నటించింది లేదు. ఇదివరకు అవకాశమొచ్చినా తృటిలో చేజార్చుకొందామె. ఈసారి మాత్రం చిరుతో నటించడానికి ఆమె ఓకే చెప్పేసిందట. ఎన్ని రోజులు కాల్షీట్లు ఇవ్వడానికైనా రెడీనే అని చెప్పిందట. ఇటీవలే వినాయక్ వెళ్లి నయనతారతో సంప్రదింపులు జరిపి వచ్చినట్టు తెలుస్తోంది.
చిరు 150వ చిత్రం వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తమిళ చిత్రం `కత్తి`ని తెలుగులో రీమేక్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకొంటున్నాడు. అందులో భాగంగా ఇటీవల కథానాయికల గురించి కీలకమైన నిర్ణయాలు జరిగిపోయాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటుండగా... ఒక పాత్రలో నయనతార, మరో పాత్రలో తమన్నా నటించబోతోందని ప్రచారం సాగుతోంది. అయితే చిత్రబృందం నుంచి మాత్రం ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటన బయటికి రాలేదు.