గత కొన్ని వారాలుగా కింగ్ ఖాన్ షారుఖ్ చాలా కష్టాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అతని కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. దీనివల్ల మానసికంగా చాలా ఆందోళనకు గురయ్యాడు బాద్ షా. కలత వల్ల తన ప్రాజెక్ట్ లన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేశాడు. కానీ ఇప్పుడు ఆర్యన్ ఇంటికి తిరిగి రావడంతో SRK తిరిగి పనిలోకి దిగాడు. లయన్ అనే వర్కింగ్ టైటిల్ తో అట్లీ చిత్రం తదుపరి షెడ్యూల్ ను ప్రారంభించాడు. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న నయనతార డేట్స్ సమస్య వల్ల తప్పుకుందని ఇటీవల పుకార్లు వచ్చాయి. కానీ ఇవేవీ నిజం కాదని తెలుస్తోంది.
నయనతార ఈ సినిమా నుంచి తప్పుకోలేదు. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న షారూక్ ని ఇబ్బంది పెట్టేందుకే ఒక సెక్షన్ అలా ప్రచారం చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు.. షారూక్-అట్లీ కాంబినేషన్ చిత్రంలో నయనతార ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటిస్తుందని తెలిసింది. షారూఖ్ ఖాన్ ఇందులో తండ్రి గా కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా జైలు సహచరుల సమూహానికి నాయకత్వం వహించే వాడిగా SRK కనిపిస్తాడు. ప్రియమణి- సన్యా మల్హోత్రా తదితరులు ఈ పాత్రల్లో నటిస్తున్నారు. వారిని సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడే నిఘా బృందాలుగా మార్చే వాడిగా షారూక్ కనిపిస్తారు. ఇది మనీ హీస్ట్ ని పోలి ఉంటుందనేది ఒక గుసగుస. అయితే దీనిని పూర్తిగా ఇండియన్ ట్రెడిషన్స్ కి తగ్గట్టుగా మలుస్తున్నారు. నయనతార ఈ విలక్షణ కేసును పరిశోధించే టాప్ పోలీసుగా నటిస్తున్నారు.
నయన్ వర్సెస్ షారూక్ ఎపిసోడ్స్ ఆద్యంతం ఈ చిత్రంలో రక్తి కట్టిస్తాయట. అయితే గొడవతో మొదలై చివరికి ఆ ఇద్దరూ ప్రేమలో పడిపోతారు మరి. నయన్ మరోవైపు వరుసగా పలు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే నాయికా ప్రాధాన్యం ఉన్న కథాంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అలాగే ప్రియుడు విఘ్నేష్ శివన్ ని పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నారని కథనాలొస్తున్నాయి.