సీక్రెట్ గా దర్గాకు వెళ్ళిన నయనతార

Update: 2017-10-30 06:07 GMT
భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం. అందుకే మన దగ్గర చాలా మతాల వారు ఇతర మతాలపట్ల కూడా విశ్వాసాన్ని చూపిస్తారు. వినాయక చవితి లడ్డూను వేలంలో కొనే ముస్లింలు.. తమవారికి మంచి జరగాలను దర్గాలకు వెళ్ళే హిందువులు.. అలాగే గోవాలోని చర్చిల్లో కూడా ఆగరబత్తీలు వెలిగించే ఇతరులు.. ఇలాంటవన్నీ మన దేశంలోనే కనిపిస్తాయి. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార కూడా అదే చేసింది.

పుట్టుకతో క్రిస్టియన్ అయిన డయానా కురియన్.. సినిమాల్లోకి వచ్చాక నయనతార అని పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఆ మద్యన హిందూ మతం కూడా స్వీకరించింది. ఇక ప్రస్తుతం రాజస్థాన్లో.. ధృవ సినిమా ఒరిజినల్ డైరక్టర్ జయం మోహన్ రాజా తీస్తున్న 'వైలైక్కరన్' షూటింగులో బిజీగా ఉంది. ఆ సమయంలో కాస్త టైమ్ దొరకడంతో.. అమ్మడు తన స్టయిలిష్ట్ తో కలసి దగ్గర్లోని అజ్మీర్ షరీఫ్‌ దర్గాను దర్శించుకుంది. అక్కడే ఓ ఫోటో కూడా దిగింది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ.. ముఖానికి ముసుగు వేసుకుని ఒక సాధారణ వ్యక్తిగా అమ్మడు అక్కడికి వెళిపోయిందట.

ఇక ఇదే దర్గాకు చాలాసార్లు ఏ.ఆర్.రెహ్మాన్.. వివి వినాయక్.. మహేష్‌ బాబు వంటి స్టార్లు అధికారికంగా వెళుతుంటారు. వాళ్లు వస్తున్నారంటే చాలా అక్కడి ఎగ్జిక్యూటివ్ కమెటీ సాధారణ భక్తులను ఆపేసి.. వీరికి ప్రత్యేకంగా దర్శనానికి ఏర్పాటు చేస్తుంటుంది. అయితే నయనతార మాత్రం.. ఒక సాధారణ వ్యక్తిగా అక్కడికి వెళ్ళడం విశేషం. ఇక నయన వెళ్ళగానే.. ఆమె సినిమా యునిట్ కూడా మొత్తంగా అక్కడికి వెళ్ళారట. అది సంగతి.


Tags:    

Similar News