సుక్కును బాలయ్య అడగడం తప్పా?

Update: 2021-12-31 03:30 GMT
నందమూరి బాలకృష్ణ అన్‌ స్టాపబుల్‌ అంటూ ఆహా లో టాక్ షో తో కుమ్మేస్తున్నాడు. బాలకృష్ణ టాక్ షో ఏంటో అంటూ కొందరు మొదట్లో పెదవి విరిచారు. కాని వారే ఇప్పుడు ముక్కున వేలేసుకుని బాలయ్య షో నిర్వహిస్తున్న తీరుతో అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. స్క్రిప్ట్‌ ప్రకారం కాకుండా తాను అనుకున్నట్లుగా వచ్చిన గెస్ట్‌ లతో చాలా క్యాజువల్‌ గా మాట్లాడుతూ షో ను ఆసక్తికరంగా మార్చేస్తున్నాడు. తాజాగా పుష్ప టీమ్‌ అన్‌ స్టాపబుల్‌ లో వచ్చిన విషయం తెల్సిందే. దర్శకుడు సుకుమార్ మరియు బన్నీ లతో బాలయ్య సాగించిన సంభాషణలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా సుకుమార్ తో ఒక సినిమా చేయాలని ఉందని.. కాని అది మూడు నెలల్లోనే పూర్తి అవ్వాలంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

బాలకృష్ణ వంటి స్టార్‌ హీరో దర్శకుడితో సినిమా చేయాలని అనుకోవడం అది బయటకు చెప్పడం.. నాతో ఒక సినిమా చేయమని అడగడం ను కొందరు తప్పు బడుతున్నారు. బాలయ్య రేంజ్ ఏంటీ ఆయన ఇలా అడగడం.. దాన్ని టెలికాస్ట్‌ చేయడం ఏంటీ అంటూ నందమూరి అభిమానులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ వద్దకు ఎంతో మంది దర్శకులు వస్తుంటారు. ఆయన తో ఒక్క సినిమా అవకాశం కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటే ఆయన మాత్రం సుకుమార్ తో సినిమా చేయాలని కోరుకోవడం ఏంటీ అంటూ చర్చ జరుగుతుంది. అయితే బాలయ్య తన తో సినిమా చేయమని అడగడం లో తప్పేం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒక టాక్ షో లో వచ్చిన అతిథితో మాట్లాడేప్పుడు అనేక విషయాలు ప్రస్థావనకు వస్తాయి. కనుక సుకుమార్‌ తో సరదాగా తనతో ఒక సినిమా తీయమని అడగడం.. దాన్ని మూడు నెలల్లో నా స్టైల్‌ లో పూర్తి చేయాలని అనడం తప్పేం కాదంటూ కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్‌ నిజంగానే బాలయ్యతో సినిమా చేస్తే బాగుండు అంటూ అభిమానులు ఆలోచించడం మొదలు అయ్యింది. మరి స్వయంగా బాలయ్య ఒక పెద్ద షో వేదిక మీద తనతో సినిమా చేయమని అడిగాడు కనుక ఖచ్చితంగా సుకుమార్‌ ఆలోచిస్తాడేమో అంటూ కొందరి అభిప్రాయం. సుకుమార్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్‌. ఆయన తో సినిమా అంటే వంద కోట్ల కు పైగానే బడ్జెట్‌. ఆయన తో సినిమాలు చేసేందుకు వరుసగా యంగ్‌ స్టార్‌ హీరోలు ఆసక్తిగా ఉన్నారు. మరి బాలయ్య అందుకు ఓకే చెప్తాడా అనేది చూడాలి.


Tags:    

Similar News