నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ గోపీచంద్ మలినేని మరియు అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలను చేసేందుకు కమిట్ అయిన విషయం తెల్సిందే.
ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107వ సినిమా ముగింపు దశకు వచ్చింది. త్వరలోనే బాలయ్య 108వ సినిమా సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో పట్టాలెక్కబోతుంది.
బాలయ్య మరియు అనిల్ రావిపూడి కాంబో సినిమా గురించిన ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా కు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన విషయం తెల్సిందే. బాలయ్య తో అనిల్ రావిపూడి చేయబోతున్న ఈ సినిమాకు గాను దాదాపుగా 75 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
గతంలో మహేష్ బాబు తో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా కంటే కూడా అధిక బడ్జెట్ ను బాలయ్య 108వ సినిమా కోసం అనిల్ రావిపూడి ఖర్చు చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి కెరీర్ లోనే ఏ సినిమాకు చేయని ఖర్చును ఈ సినిమా కోసం చేయించబోతున్నాడట.
కథానుసారంగా ఈ సినిమా కాస్త ఎక్కవ బడ్జెట్ ను కోరుకుంటుందని.. అందుకే ఈ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి కాస్త ఎక్కువగానే ఖర్చు చేయించబోతున్నాడట. బాలయ్య కెరీర్ లో కూడా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లోకి ఈ సినిమా కాస్త ఎక్కువ బడ్జెట్ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు.
ఎఫ్ 3 సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. కనుక దర్శకుడు అనిల్ రావిపూడి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాను చేయబోతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనిలో ఉన్నాడు. ఇదే ఏడాది చివరి నుండి సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.