బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలతో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే - సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 26న ముగ్గురిని విడివిడిగా విచారించిన ఎన్సీబీ బృందాలు.. వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరింత సమాచారం తెలుసుకోవడానికి వీరి మొబైల్ ఫోన్లు కూడా ఎన్సీబీ అధికారులు తీసుకున్నట్లు రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. అంతేకాకుండా దీపికా - సారా - శ్రద్ధాలు గత మూడేళ్ల కాలంలో జరిపిన ఆర్థిక చెల్లింపులపై కూడా ఎన్సీబీ ద్రుష్టి పెట్టనుందని సదరు టీవీ ఛానల్ కథనం ప్రసారం చేసింది.
కాగా, రిపబ్లిక్ టీవీ కథనం ప్రకారం డ్రగ్ అభియోగాలు ఎదుర్కుంటున్న సెలబ్రిటీల బ్యాంక్ స్టేట్మెంట్స్ ద్వారా గత మూడేళ్లలో డ్రగ్ వ్యవహారాల్లో పాలుపంచుకున్నారా అని ఎన్సీబీ విచారించనుంది. వీరు టాలెంట్ మేనేజర్ జయ సహాకి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ద్వారా చెల్లింపులు చేస్తే.. ఆమె డ్రగ్ పెడ్లర్స్ కి ట్రాన్స్ఫర్ చేసిందా అనే కోణంలో కూడా విచారించనున్నారట. ఇదిలా ఉండగా ఐదున్నర గంటల ఎన్సీబీ అధికారుల విచారణలో దీపికా పడుకునేని.. తన మేనేజర్ కరీష్మా ప్రకాష్ తో డ్రగ్ చాట్ చేసినట్లు అంగీకరించిందని 'టైమ్స్ నౌ' పేర్కొంది. వాట్సాప్ డిస్కషన్ లో 'వీడ్' 'మాల్' 'హ్యాష్' వంటి నిషేధిత డ్రగ్స్ కు సంబంధించిన వాటి గురించి మెన్షన్ చేసినట్లు ఒప్పుకుందని.. అయితే డ్రగ్స్ తీసుకోలేదని దీపికా చెప్పినట్లు సదరు ఛానల్ వెల్లడించింది. అలానే ఈ కేసులో విచారణ ఎదుర్కున్న సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ లు సైతం సుశాంత్ నిర్వహించే పార్టీలకు అటెండ్ అయ్యామని ఒప్పుకుంటూనే ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.