సుశాంత్ మృతి విషయంలో నిజా నిజాలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ఏకంగా మూడు జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయి. ఇప్పటికే ఈడీ వారు మనీ ల్యాండరింగ్ కేసులో రియా మరియు ఆమె కుటుంబ సభ్యులను ప్రశ్నించడం జరిగింది. ఇక సీబీఐ వారు ఇప్పటికే పలు దఫాలుగా కేసును విచారించి పలువురిని ప్రశ్నించారు. రియాను అయిదు రోజుల పాటు ప్రశ్నించి ఆమె నుండి కీలక సమాచారం రాబట్టారు. అదే సమయంలో ఆమె కు డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు. ఎన్ సీ బి వారు ఇప్పటికే రియాను అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే.
నేడు ముంబయి ప్రభుత్వ ఆసుపత్రిలో రియాకు ఎన్ సీ బీ వారు డ్రగ్ పరీక్ష చేయించబోతున్నారు. కొన్ని రోజుల క్రితమే రియా తనకు ఏ సమయంలో అయినా డ్రగ్స్ పరీక్ష చేసుకోవచ్చు అంటూ పేర్కొంది. రియా లాయర్ కూడా డ్రగ్స్ కేసులో ఆమెకు సంబంధం లేదు. ఆమెను పరీక్షించుకోవచ్చు అన్నాడు. కనుక రియా సొంతంగానే పరీక్ష కు సిద్దం అయ్యింది కనుక ఆమె ఎప్పుడు డ్రగ్స్ తీసుకోక పోవచ్చు అంటూ జనాలు అనుకుంటున్నారు.
నేడు ఆమెకు పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో అసలు విషయం ఏంటీ అనేది బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేయంలో రియా కీలకంగా వ్యవహరించింది అంటూ ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఆమె సోదరుడు కూడా ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే.