బాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ మరియు ఆయన ప్రియురాలు గాబ్రియెల్లా దెమిత్రియాడెన్ ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే అర్జున్ రాంపాల్ కి ఎన్సీబీ అధికారులు మరోసారి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. పలువురు డ్రగ్ ప్లెడర్ లతో అర్జున్ రాంపాల్ కి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో గత నవంబర్ లో ఎన్‌సీబీ అధికారులు నోటీసులు జారీ చేసి విచారించారు. ఈ క్రమంలో తాజాగా మళ్ళీ విచారణకు రావాలని ఆదేశిస్తూ మంగళవారం సమన్లు అందజేసారు. రేపు(డిసెంబర్ 16) ఎన్‌సీబీ కార్యాలయానికి విచారణకు హాజరకావాల్సిందిగా అందులో ఎన్‌సీబీ అధికారులు పేర్కొన్నారు.
కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ కేసుపై ఎన్‌సీబీ దర్యాప్తు చేపడుతోంది. ఈ క్రమంలో అనేకమంది సెలబ్రిటీలను విచారించడంతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఇక గత నెలలోనే అర్జున్ రాంపాల్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అధికారులు పలు డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 9 మరియు 11వ తేదీలో విచారణకు హజరుకావాల్సిందిగా ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో మరోసారి ఎన్సీబీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.