దెబ్బకి థింకింగ్ మారిపోయేలా..!
శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది.
రెండు దశాబ్దాలలో ఎన్నో సినిమాల నిర్మాతగా అనుభవం ఉన్న దిల్ రాజుకి రాం చరణ్ గేమ్ చేంజర్ ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. ఐతే సినిమా కమర్షియల్ గా సక్సెస్ అందుకోవడంలో వెనకపడ్డది. దిల్ రాజు ఈ సినిమాకు 450 కోట్ల దాకా బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా ఇచ్చిన షాక్ తో ఇక పాన్ ఇండియా సినిమాల జోలికి వెల్లకూడదని దిల్ రాజు నిర్ణయించుకున్నారట. గేమ్ ఛేంజర్ సినిమాకు ఎలా లేదన్నా భారీ లాసులు వచ్చినట్టు తెలుస్తుంది. లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 120 నుంచి 150 కోట్ల దాకా లాసులు వచ్చాయట. రాం చరణ్ ఈ సినిమా లాసులు కవర్ చేసేలా ఒక వేళ నెక్స్ట్ సినిమా ఆఫర్ ఇచ్చినా కూడా దిల్ రాజు ఆ సాహసం చేసే పరిస్థితిలో లేడని తెలుస్తుంది.
20 ఏళ్ల ప్రొడక్షన్ అనుభవం ఉన్న దిల్ రాజు శంకర్ మీద నమ్మకంతో బ్లైండ్ గా వెళ్లిపోయాడు. ఐతే రిజల్ట్ చూసి షాక్ అయ్యాడు. అందుకే ఇక మీదట ఇలాంటి సాహసాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాడట. దిల్ రాజు బ్యానర్ కి పేరు తెచ్చింది చిన్న సినిమాలే. ఈ బ్యానర్ మొదట్లో మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ వచ్చింది. అంతేకాదు కంటెంట్ బాగున్న సినిమాలనే ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది. అందుకే దిల్ రాజు అప్పట్లో వరుస సక్సెస్ లు అందుకున్నాడు.
ఐతే గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం దిల్ రాజు కాలిక్యులేషన్స్ దెబ్బ కొట్టాయి. రాం చరణ్ శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఈ రేంజ్ లో బొక్క పెడుతుందని ఊహించలేదు. సంక్రాంతికి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చి కాస్త ఒడ్డున పడేసింది లేకపోతే దిల్ రాజుకి భారీ నష్టం వాటెల్లేదని చెప్పొచ్చు. ఎంచక్కా కాన్సెప్ట్ సినిమాలు చేసుకుంటూ పెద్దగా రిక్స్ లేకుండా చేస్తున్న దిల్ రాజు తన జాగ్రత్తల్లో తను ఉండాలని డిసైడ్ అయ్యారు. అందుకే స్టార్ సినిమా వందల కోట్ల బడ్జెట్ అంటే తన వల్ల కాదని ముందే డిసైడ్ అయ్యాడు.