మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం 'ఉప్పెన'. బుచ్చి బాబు సన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 2 న రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ ప్రారంభం అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి నీ కన్ను నీలి సముద్రం అంటూ సాగే ఓ పాట ప్రోమో ను విడుదల చేశారు.
సాంగ్ టీజర్ లాగా కాకుండా సాంగ్ ఆరిజిన్ అంటూ పాట ఎలా పుట్టిందో వీడియోలో చూపించడం కొత్తగా ఉంది. అలలు ఎగసి పడుతున్న సముద్రపు ఒడ్డున దర్శకుడు బుచ్చిబాబు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ తో నడుస్తూ "మన ఉప్పెన మూవీ ఫస్ట్ సాంగ్ కోసం వచ్చాను సార్" అంటాడు. సిట్యుయేషన్ ఏంటి బుచ్చిగారు" అంటూ దేవీ ప్రశ్నిస్తే "హీరో చిన్నప్పుడు దర్గా దగ్గర హీరోయిన్ ను ఫస్ట్ టైం చూస్తాడు. చూసి.. ఆ దేవుడికి పెట్టే దణ్ణం.. అదే దణ్ణం ఈ అమ్మాయికి పెడతాడు సార్" అంటూ ఇంకా ఆ సందర్భం గురించి వివరిస్తాడు. ఇదంతా విన్న దేవీ "నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం" అంటూ గిటార్ వాయిస్తూ ఓ క్యాచీ ట్యూన్ ఇస్తాడు. ఈ ట్యూన్ కు డైరెక్టర్ బుచ్చిబాబు వెంటనే ఓకే చెప్తాడు.
లాస్ట్ లో ఈ పాటను సింగర్ జావేద్ అలీ స్టూడియోలో పాడుతున్నట్టుగా చూపించారు. ఈ పాట లిరికల్ వీడియో రేపు సాయంత్రం(మార్చ్ 2 వ తేదీ 4.05 గంటలకు) రిలీజ్ చేస్తారని వెల్లడించారు. ఈ ప్రోమో వీడియో ఐడియా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పాట కూడా దేవీ స్టైల్ లోనే ఉంది. రేపు మొత్తం పాటను చూసేలోపు ఈ ప్రోమో పై ఓ లుక్కేయండి.
Full View