నీలకంఠ చేతికి చిక్కిన క్వీన్

Update: 2017-09-06 05:45 GMT
హాట్ బ్యూటీ కంగనా రనౌత్ ను బాలీవుడ్ కి మహారాణిని చేసిన మూవీ క్వీన్. ఈ మూవీ సక్సెస్.. అందులో కంగనా నటన చూసిన తర్వాత.. ఆమెతో లీడ్ రోల్ లో సినిమా చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపారు. ఆమె కోసమే కేరక్టర్లు సృష్టించారు. అలాంటి అద్భుతమైన చిత్రాన్ని.. సౌత్ లో కూడా అందించేందుకు చాలానే ప్రయత్నాలే జరిగాయి.

దక్షిణాదిలోని నాలుగు భాషల్లో నలుగురు హీరోయిన్లతో.. వేర్వేరు దర్శకులు క్వీన్ చిత్రాన్ని రీమేక్ చేస్తారనే మాట వినిపించింది. అయితే.. అన్నీ సాధ్యం కాలేదు. ఇప్పటివరకూ కన్నడలో మాత్రమే ఈ రీమేక్ షూటింగ్ ప్రారంభించుకుంది. ఇప్పుడు తెలుగులో కూడా క్వీన్ రీమేక్ మొదలయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. క్వీన్ తెలుగు వెర్షన్ లో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుండగా.. దర్శకుడిగా నీలకంఠను ఖాయం చేశారు. ముందు చాలామంది పేర్లే వినిపించినా ఎట్టకేలకు.. షో.. మిస్సమ్మ వంటి చిత్రాలతో ఆకట్టుకుని నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ నీలకంఠ చేతికే ఈ మహారాణి చిక్కిందట.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న నీలకంఠ.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. దాదాపు స్క్రిప్ట్ ప్రిపేర్ గానే ఉన్నా.. తన స్టైల్ లోకి మార్చుకునే పనిలో ఉన్నాడట నీలకంఠ. ఈ ప్రాజెక్టుపై తమ్ము కూడా తెగ ఆసక్తిగా ఉంది కాబట్టి.. నీలకంఠ ఎప్పుడు సై అంటే అఫ్పుడు షూటింగ్ ప్రారంభమైపోయే అవకాశాలు ఉన్నాయి.



Tags:    

Similar News