స్వచ్ఛ్‌ భారత్పై సినిమా

Update: 2015-07-04 15:30 GMT
మోడీ ప్రధానమంత్రయిన తరువాత దేశమంతా ప్రాచుర్యంలోకి వచ్చిన కార్యక్రమం స్వచ్ఛ భారత్‌... స్వపక్షం, విపక్షం అని లేకుండా అందరూ దీనికి మద్దతు పలకాల్సిన సబ్జెక్టుగా మారింది. ఇంతగా పాపులర్‌ అయిన ఈ సబ్జెక్టుపై సహజంగానే బాలీవుడ్‌ కన్నుపడింది. ఇంకేముంది సినిమాగా రూపుదిద్దుకోనుంది. అవును.... భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమంతో ముడిపడ్డ కథను సినిమాగా రూపొందిస్తున్నారు. బాలీవుడ్‌ దర్శకుడు నీరజ్‌ పాండే ఈ బాధ్యత నెత్తనేసుకున్నారు. గతంలో ఎ వెడ్నేస్‌ డే', 'స్పెషల్‌ 26'', ''బేబీ'' వంటి చిత్రాలను రూపొందించిన ఈ దర్శకుడు ప్రస్తుతం ''టాయిలెట్‌ : ఏక్‌ ప్రేమ్‌ కథ'' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

    ఈ సినిమా ప్రధానంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని టార్గెట్‌ చేస్తోంది. స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమంలో మరుగుదొడ్డి నిర్మాణ ప్రాముఖ్యతను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించనున్నారు. ''ప్రేమ కోసం తాజ్‌ మహల్‌ కట్టడానికి సిద్ధపడే వారు ఇంటివారి కోసం మరుగుదొడ్డిని నిర్మించరెందుకు'' అని ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రజలను ప్రశ్నిస్తారట. హాస్యం, సందేశం ఉండేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News