నీతూ చంద్ర... గుర్తుందా..? అదేనండీ.. శేఖర్ కమ్ముల చిత్రం ‘గోదావరి’ రాజీగా కనిపించిందే, ఆ హీరోయినే! ఆ సినిమాలో బాగా హోమ్లీగా నటించింది. అప్పట్లో ఒక వివాదంతో తెలుగులో నీతూ బాగా పాపులరైంది. హీరో రాజశఖర్ పక్కన ఓ సినిమాలో పోలీస్ గెటప్ వేసింది. సరిగ్గా అప్పుడే రాజశేఖర్ పై కొన్ని ఆరోపణలు కూడా చేసింది! ఆ తరువాత, తెలుగులో ఆమెకి అవకాశాలు రాలేదు. ఇక, బాలీవుడ్ లో బికినీ బేబీగా గుర్తింపు తెచ్చుకుంది. ‘గరమ్ మసాలా’ చిత్రంలో బికినీ వేసుకుని అదరగొట్టింది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది నీతూ. అయితే, చాలా గ్యాప్ తరువాత నీతూ ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ చేస్తోంది. అదీ సూర్య హీరోగా వస్తున్న సింగం-3లో..!
ఈ ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా జరిగిపోయింది. ఈ పాట రషెస్ చూసివాళ్లు నోరెళ్లబెట్టేస్తున్నారట! బికినీ బేబీ నీతూ చంద్ర రెచ్చిపోయి అందాలను ప్రదర్శించిందని అంటున్నారు. సింగం-3 ప్రత్యేకతలు ఏంటీ అంటే... నీతూ చంద్ర సాంగ్ అని చెప్పుకునే రేంజిలో ఉందని అంటున్నారు. అద్భుతమైన డాన్స్ తోపాటు వేడెక్కించే అందాలతో నీతూ ఆకట్టుకోవడం ఖాయం అని చెప్పుకుంటారు. నిజానికి, నీతూ ఆశలన్నీ ఈ పాట మీదే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే, సౌత్ లో మరోసారి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఈ సాంగ్ ఉపయోగపడుతుందని భావిస్తోంది. అందుకే, వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బాగానే ప్రయత్నించినట్టుంది! మొత్తానికి.. నీతూ చంద్ర ఐటమ్ సాంగ్ పై బాగానే హైప్ క్రియేట్ అవుతోంది. మరి, సింగం పక్కన నీతూ ఏం చేసిందో చూడాలంటే... ఇంకొన్నాళ్లు వెయిటింగ్ తప్పదు!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/