ఆసనాలకు అందాలు తోడైతే

Update: 2017-05-26 12:50 GMT
టాలీవుడ్ మూవీ విష్ణుతో తెరంగేట్రం చేసిన భామ నీతు చంద్ర.. గోదావరి మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నా.. తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. అయితే.. తమిళ్.. హిందీ భాషా చిత్రాల్లో మాత్రం వరుస అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్ కంటిన్యూ చేస్తోంది ఈ 32 సంవత్సరాల బ్యూటీ.

అందాల ప్రదర్శన విషయంలో అప్పుడప్పుడు మాత్రమే ముందుకొచ్చే ఈ బ్యూటీ.. తాజాగా యోగసనాల ఫోటో షూట్ తో సెన్సేషన్ సృష్టిస్తోంది. యోగాలోని పలు రకాల ఆసనాలను వేసి చూపిస్తూ.. అందులో తాను ఎంతటి ట్యాలెంటెడ్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది నీతు చంద్ర. ఆరోగ్యం కోసం నీతు చూపించిన ఆసనాలు.. భంగిమలు కళ్లు చెదిరేలా ఉన్నాయ్ కానీ.. డ్రెసింగ్ విషయంలో కన్వీనియన్స్ కోసం కాసింత పొదుపు పాటించడంతో.. అందాల ఆరబోత స్థాయి కూడా ఎక్కువగానే కనిపిస్తోంది.

యోగ కారణంగా తాను ఎంతటి ఫిట్ గా ఉంటుందో.. బాడీ ఫిట్నెస్ ఏ స్థాయిలో మెయింటెయిన్ చేస్తుందో చెప్పకనే చెప్పింది నీతు చంద్ర. రీసెంట్ గా ఈ బ్యూటీ సింగం3 మూవీలో కనిపించగా.. త్వరలో రానున్న తమిళ్ మూవీ వైగై ఎక్స్ ప్రెస్ లో డ్యుయల్ రోల్ చేస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News