వారి లిస్ట్ లో మన్నారా చేరుతుందా?

Update: 2016-08-01 12:45 GMT
హీరోలకు - నిర్మాతలకు మరికొంతమంది సీనియర్ నటులకు తమ తమ కొడుకులు వారసులైతే... నాటి నుంచి నేటివరకూ హీరోయిన్ లకు మాత్రం వారి వారి చెల్లెళ్లు వారసులు అవుతున్నారు. అయితే ఇలా అక్క పేరు చెప్పి సినిమాల్లోకి వచ్చిన చెల్లెళ్ల సక్సెస్ పర్సంటేజ్ మాత్రం చాలా తక్కువనే అనుకోవాలి. నగ్మ సిస్టర్ గా వచ్చిన జ్యోతిక కాస్త రాణించినా... తర్వాత సూర్యని పెళ్లిచేసుకుని సెటిల్ అయిపోయింది. ఇక మిగిలిన ఫేమస్ హీరోయిన్స్ చెల్లెళ్ల సంగతి ఒకసారి గమనిస్తే... షమితా శెట్టి - నిషా అగర్వాల్ - అదితీ అగర్వాల్ - అక్షర హాసన్ వంటివారంతా అక్కలకు మించిన లేక సరిసమానమైన చెల్లెళ్లుగా మిగలలేకపోయారు. అయితే తాజాగా మరో హీరోయిన్ గురించి ఈ చర్చ ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తుంది.

బాలీవుడ్ టాప్ హీరోయిన్ - మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా చెల్లెలు మన్నారా చోప్రా. బాలీవుడ్ లోని తన తొలిసినిమా జిద్ లో ఒక రేంజ్ లో అందాల విందు చేసినా ఈమెకు కాలం కలిసిరాలేదు. ఇక తెలుగులో ప్రేమా గీమా జాంతానై సినిమాలో నటించినా.. ఆ సినిమాకే అడ్రస్ అంతంతమాత్రంగా ఉండటంతో.. ఇక ఈమె సంగతి ఎవరికి? ఇదే క్రమంలో తాజాగా విడుదలయిన జక్కన్న సినిమాలో హీరోయిన్ గా నటించింది మన్నారా. ఈ విషయంలో మన్నారాపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. జక్కన్నలో మన్నారా కాస్త బొద్దుగా - ముద్దుగా - సెక్సీ అప్పీల్ తో ఉందని కొంతమంది చెబుతుంటే.. కేవలం డాన్సులు చేయడానికి మాత్రమే పనికివచ్చొంది - ఏమాత్రం నాజూకు తనం లేని హీరోయిన్ గా ఉందని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక మన్నారా నటించిన ‘తిక్క’ ఆడియో వేడుకలో ‘జక్కన్న’ సూపర్ హిట్ అని.. తెలుగు ప్రేక్షకులు తనను భలే ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చింది. అయితే తిక్క సినిమా సాయిధరం కంటే మన్నారాకు కచ్చితంగా లైఫ్ అండ్ డెత్ సినిమా అనే అభిప్రాయం ఎక్కువమందిలో వ్యక్తమవుతోంది. ఆ సినిమా కూడా తేడా కొట్టేసిందంటే మాత్రం ముందుగా చెప్పుకున్న లిస్ట్ లో మన్నారా చేరిపోతుందనే అనుకోవాలి. ఆగస్టు 13వరకూ ఆగితే మన్నారా భవితవ్యం తేలిపోతుంది!!
Tags:    

Similar News