లీసాని ఫాలో అయిపోయిన నేహా

Update: 2016-11-03 06:29 GMT
బాలీవుడ్ భామ లీసా హేడెన్ రీసెంట్ గా సీక్రెట్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ లో పుట్టిన బ్రిటిష్ వ్యాపారవేత్త గుల్లు లల్వాని కొడుకు.. డినో లల్వాని ని ప్రేమించి మరీ పెళ్లాడింది లీసా. ఈ డెస్టినేషన్ మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోలు కూడా బయటకొచ్చేసినా.. ఈ భామ ఓ విషయంలో ఫైర్ అయింది. తను పాకిస్తానీ అనడంపై గుర్రుమని లీసా ఫైర్ అయింది కూడా.

ఆ సంగతి అలా ఉంటే.. ఇప్పుడు సింగర్ నేహా భాసిన్ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసేసుకుంది. ఓ రకంగా ఇది సీక్రెట్ మ్యారేజ్ అనే చెప్పాలి. లీసా హేడెన్ థాయ్ వెళ్లి పెళ్లి చేసుకుంటే.. నేహా భాసిన్.. టస్కనీలో ఆ తంతు పూర్తి చేసింది. ఈ సింగర్ మనకు కూడా బాగా పరిచయమే. కరెంట్- అటు నువ్వే ఇటునువ్వే.. దడ-హెలో హెలో.. ఉసరవల్లి- నిహారికా నిహారీకా.. 1నేనొక్కడినే- ఆవ్ తుజే మో కర్తా.. పాటలతో టాలీవుడ్ శ్రోతలను అలరించింది నేహా భాసిన్.

తనకు చిన్నప్పటి నుచి తెలిసిన మ్యూజిక్ కంపోజర్ సమీర్ ఉద్దీన్ ను పెళ్లి చేసుకున్న నేహా.. 'టీనేజ్ నుంచే తను నాకు తెలిసినా.. మేమిద్దరం అప్పట్లో కనెక్ట్ కాలేదు. కానీ సంగీతం మా ఇద్దరినీ ఒకటి చేసింది' అని చెబుతోంది నేహా భాసిన్. అక్టోబర్ 23న ఇటలీలలోని టస్కనీలో పెళ్లి జరిగినట్లు ఇప్పుడు అనౌన్స్ చేసింది నేహా.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News