సోషల్ మీడియా విస్తృతమయ్యాక కాదేదీ వైరల్ కు అనర్హం అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. ముఖ్యంగా సెలబ్రిటీలకు దీని బెడద మరీ ఎక్కువగా ఉంది. ఆఖరికి ఏ డ్రెస్ వేసుకుని బయటికి రావాలో వస్తే ఎలాంటి కామెంట్స్ వస్తాయో అని ఒకటికి రెండుసార్లు ఆలోచించే ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ ఎవరో చాటుగా తీసిన ఫోటోకు చిన్నపాటి ఆన్ లైన్ యుద్ధమే చేసింది. ఇప్పుడు నేహా ధూపియా వంతు వచ్చింది. హీరోయిన్ గా జూలీ లాంటి బోల్డ్ మూవీస్ ద్వారా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ సినిమాలు తగ్గిపోయాక కొంత గ్యాప్ తీసుకుని ఇంటర్వ్యూ షో నడుపుతూ యాంకర్ గా సెకండ్ ఇన్నింగ్స్ మంచి ఫామ్ లో నడుపుతోంది.
అయితే గత ఏడాది గర్భం దాల్చడంతో కొంత గ్యాప్ తీసుకుని నవంబర్ లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కొన్నిరోజుల రెస్ట్ లో ఉన్న నేహా ధూపియా ఇటీవలే బయటికి వచ్చింది. ఫెమినా స్టైలిస్టా వెస్ట్ 2019 ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ లో పాల్గొంది. ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చిన సహజమైన మార్పుల వల్ల నేహా ఒళ్ళు చేసి కాస్త బొద్దుగా మారింది. దీంతో ఓ మీడియాలో ఈ పాయింట్ నే హై లైట్ చేస్తూ వ్యంగ్యంగా ఓ కథనం రాసారు. శరీరం అదుపు తప్పిందని ఇలా అయితే ఇంకా ఇంటికే పరిమితం కావాలని రకరకాలుగా అందులో ఏదేదో పెట్టేసారు. దీంతో ఒళ్ళు మండిన నేహా ధూపియా మెత్తగా క్లాస్ పీకి ఆరోగ్యంగా ఉండటం గురించే ఆలోచిస్తాను తప్ప ఇలా మీకోసమో ఇంకెవరి కోసమో ఒళ్ళు హూనం చేసుకోనని తేల్చి చెప్పింది.
ఇది కాస్తా వైరల్ కావడంతో తనను మెచ్చుకుంటూ కరణ్ జోహార్-సోనమ్ ఆహుజా-ఫర్హాన్ అక్తర్-తాప్సీ పన్ను తదితరులంతా బహిరంగ మద్దతు తెలిపారు. నువ్వెలా ఉన్నా నీ శక్తి అందరికి స్ఫూర్తి ఇస్తుందని ఎవరి మాటలకు బదులు చెప్పాల్సిన అవసరం లేదని అండగా నిలిచారు. సిగ్గుపడకుండా నేహా ధూపియా ఇష్యూని డీల్ చేసిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. నేహా గతంలో ఓ తెలుగు స్ట్రెయిట్ మూవీ చేసింది. రాజశేఖర్ డ్యూయల్ రోల్ చేసిన విలన్ అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యింది కానీ అది ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. అంగద్ బేడీ తో వివాహం కూడా హడావిడిగా చేసుకుని ఆ టైంలో కూడా వార్తల్లో నిలిచిన నేహా మళ్ళీ ఇప్పుడీ లావు గోలతో వార్తల్లోకి వచ్చింది.