`చిరుత` చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది బీహార్ సోయగం నేహా శర్మ. ఆ తరువాత వరుఫ్ సందేశ్ తో `కుర్రాడు` చిత్రంలో చేసినా ఫలితం లేకపోవడంతో బాలీవుడ్ బాట పట్టేసింది. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ నటించిన థ్రిల్లర్ `క్రూక్` తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించింది. అప్పటి నుంచి హిందీ, మోండరిన్, పంజాబీ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. కెరీర్ పరంగా కొంత డల్ ఫేజ్ ని ఎదుర్కొంటున్న నేహా ప్రస్తుతం వెబ్ సిరీస్లలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
విరామ సమయాల్లో సోసల్ మీడియా వేదికగా హాట్ ఫొటో షూట్ లతో రచ్చ చేస్తున్న నేహ శర్మ ఏ సందర్భంగావచ్చినా సరే తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని హీటెక్కించేస్తూ అభిమానుల్ని తన వలలో పడేలా చేస్తోంది. నేహాకి తోడు ఆమె సోదరి అహిషాశర్మ కూడా తోడవ్వడంతో సోషల్ మీడియాలో వీరు చేస్తున్న హంగామాకు హద్దే లేకుండా పోయింది. తాజాగా వీరిద్దరికి షూటింగ్ ల నుంచి విరామం చిక్కడంలో విదేశాలకు విహారానికి వెళ్లారు.
అక్కడి రోడ్లపై ఈ ఇద్దరు చేసిన సందడి అంతా ఇంతా కాదు. టెస్లా కార్లో జాలీగా రైడ్ కి వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని నేహా శర్మ సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. టెస్లా కార్ లో ప్రయాణం చాలా సరదాగా వుంది. ఈ కార్లని ఎప్పుడు ఇండియన్ మార్కెట్ లోకి తీసుకొస్తావ్ ఎలన్ మాస్క్ ` అంటూ నేహా శర్మ ట్వీట్ చేసింది. టెస్లా కార్ కున్న ప్రత్యేకత ఏంటన్నది తెలిసిందే. డ్రైవర్ లేకుండా మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని కార్లో అమర్చిన మానిటర్లో సెట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా అదే గమ్యానికి చేరుస్తుంది.

దీన్ని ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశ పెట్టాలని ఎలన్ మాస్క్ తో మన భారతీయ ఆటో ఇండస్ట్రీకి చెందిన వ్యాపార వేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో మొత్తం నాలుగు మోడల్స్ వున్నాయట. ఒకటి Tesla Model Y దీని ఖరీదు 70 లక్షలట. Tesla Model 3 దీని ఖరీదు 60 లక్షలట. Tesla Model X దీని ఖరీదు 2 కోట్లు. Tesla Model S దీని ఖరీదు 1.50 లక్షలట. ఇవి త్వరలోనే ఇండియన్ మార్కెట్ లోకి రానున్నాయి.