ఫోటో స్టొరీ: మళ్ళీ నేర్పుగా సెల్ఫీ తీసుకుందే!

Update: 2019-03-07 13:28 GMT
కొన్ని విషయాల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివితీరదు.  సోషల్ మీడియాలో చురకత్తుల్లాంటి భామల అందాల గురించి చెప్పుకున్నప్పుడు కూడా అంతే.  అందుకే మనలాంటి 'కూసింత కలాపోసన' ఉండే ఘనులైన నెటిజనులకోసమే నేహ శర్మలాంటి అందగత్తెలు కఠినమైన కసరత్తులు చేస్తూ అందాల బిగి సడలకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.  వాటిని ఇన్స్టాగ్రామ్ విస్తరాకుపై మనసారా వడ్డిస్తారు.  

తాజాగా మరోసారి నేహ శర్మ అదే పని చేసింది.  ఈసారి అందాల వడ్డన కోసం ఫోటోలా కాకుండా.. తనకొచ్చిన ఇన్విటేషన్ చూపించడం కోసం అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ కవర్ చేస్తూనే అందాలను ఫుల్ గా వడ్డించేసింది.  అయినా ఇన్విటేషన్ చూపించాలనుకుంటే ఆ ఇన్విటేషన్ కు మాత్రమే ఫోటో తీసి దాన్ని పోస్ట్ చేస్తే సరిపోతుంది.  లేదా సంప్రదాయంగా నిండుగా చిటికెనవేలు కూడా కనబడకుండా దుస్తులు ధరించి అప్పుడు ఇన్విటేషన్ చేతిలో పట్టుకుని ఫోటోకు పోజివ్వచ్చు.  అదీ కాదు.. ఇదీ కాదు. కుడిచేత్తో సెల్ఫీ తీస్తూ.. ఎడమచేత్తో ఇన్విటేషన్ కార్డ్ పట్టుకుంది.. ఎలా అంటే తన అందాలకు నెటిజనులకు మధ్య అది అడ్డం రాకుండా ఎంతో నేర్పుగా.  క్లీవేజ్ వ్యూ కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సెల్ఫీ తీసుకుంది.  ఆ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో పడేసింది.  అమ్మడి దెబ్బకు నెటిజనులు ఆరు గంటల్లోనే 2.3 లక్షల లైకులు కొట్టారు.

అయినా మన ఫోటో కథలో 'ఇన్విటేషన్'అనే పదం ఐదు సార్లు రిపీట్ అయింది.  అసలదేం ఇన్విటేషన్ అని అనుమానం రాలేదా?  అమెజాన్ ప్రైమ్ వారు మర్చి 8 నుండి 'మేడ్ ఇన్ హెవెన్' అనే వెబ్ సీరీస్ ను స్ట్రీమింగ్ చేస్తున్నారు.  ఈ వెబ్ సీరీస్ ను క్రియేట్ చేసినవారు జోయా అఖ్తర్ - రీమా కగ్తి.  శోభిత ధూళిపాళ.. కల్కి కొచ్లిన్.. జిమ్ సర్భ్.. అర్జున్ మాథుర్.. శశాంక్ అరోరా ఈ వెబ్ సీరీస్ లో కీలకపాత్రలు పోషించారు.  9 ఎపిసోడ్లుగా సాగనున్న ఈ కార్యక్రమం లాంచ్ కోసమే నేహపాపకు ఇన్విటేషన్.   


Tags:    

Similar News