టిల్లు నమ్మకున్నా మీరు నమ్మినారు .. రాధిక ఎమోషనల్‌ ట్వీట్‌ వైరల్‌

Update: 2022-03-13 11:03 GMT
సిద్ధు జొన్నలగడ్డ హీరో గా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు ఇటీవలే వచ్చిన డీజే టిల్లు చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక చిన్న సినిమాగా విడుదలైన డీజే టిల్లు అనూహ్యంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మరో సారి కంటెంట్ ఉన్న సినిమా లకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపించింది. ఈ సినిమాతో టాలీవుడ్ కు మరో విజయ్ దేవరకొండ దొరికాడు అంటూ సిద్దు ని ప్రేక్షకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి గురించి కూడా ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. సినిమాలో రాధిక అనే పాత్రలో ఆమె కనిపించిన విషయం తెలిసిందే. నేహా శెట్టి గతంలో నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకు రాలేకపోయాయి. ఆ సినిమా లు సక్సెస్ ను తెచ్చి కమర్షియల్‌ హీరోయిన్ గా నిలబెట్టలేక పోయాయి. కానీ ఈ సినిమా మాత్రం ఆమె కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.

డీజే టిల్లు సినిమా తర్వాత అనూహ్యంగా నేహా శెట్టి కి వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ఈ సమయంలో ఆమె సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని అభిమానులతో మరియు ప్రేక్షకులతో పంచుకుంది. ఆ సందర్భంగా నేహా కాస్త ఎమోషనల్ అయ్యింది. సోషల్ మీడియాలో నేహా శెట్టి డీజే టిల్లు సక్సెస్ మరియు రాధిక పాత్ర ను ప్రేక్షకులు ఆదరించిన తీరుపై స్పందిస్తూ కాస్త ఎమోషనల్‌ అయ్యింది.

ట్విట్టర్ లో నేహా.. రాధిక ని టిల్లు నమ్మలేదు.. కానీ మీరు మాత్రం నమ్మారు, ఆమెని ఒప్పుకున్నారు. రాధిక మీ అందరినీ ఎంతో ప్రేమిస్తుంది. డీజే టిల్లు ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇంత పెద్ద విజయం మీ వల్లే సాధ్యమైంది. మీ ప్రేమ మరియు సపోర్ట్ తోనే సినిమా ఘన విజయం సాధించింది. అందుకే ఇక మీదట నేను తప్పకుండా మంచి సినిమాలను మీకు అందిస్తాను అని ప్రామిస్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది.

నేహా శెట్టి డీజే టిల్లు సినిమాలో విభిన్న తరహాలో కనిపించింది. కొద్ది సమయం నెగిటివ్ గా అనిపిస్తుంది.. కొద్ది సమయం అమాయకపు అమ్మాయి అనిపిస్తుంది. మొత్తంగా ఒక ట్రెండీ అమ్మాయి పాత్రలో కనిపించి మెప్పించింది. కనుక ముందు ముందు టాలీవుడ్ లో ఆమెకు ఖచ్చితంగా మంచి ఆఫర్లు వస్తాయనే నమ్మకం.. విశ్వాసం ను టాలీవుడ్ పెద్దలు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News