బోయపాటి గట్టిగానే లాక్కొచ్చాడే

Update: 2017-08-18 16:59 GMT
ఆగస్టు 11 రిలీజులన్నీ వారం కంప్లీట్ చేసుకున్నాయి. ఇంతకీ బాక్సాఫీస్ దగ్గర వీటి ప్రదర్శన ఎలా ఉంది అని చూస్తే.. తక్కువ ధియేటర్లలో రిలీజై కూడా గట్టిగా సత్తా చాటుతోంది జయ జానకి నాయక. ఇక నేనే రాజు నేనే మంత్రి సినిమాకు ధియేటర్లు బాగా ఉండటంతో కలక్షన్లు బాగానే ఉన్నాయి. లై సినిమా విషయానికొస్తే కాస్త రేసులో స్లో అవుతోందనే చెప్పాలి.

అన్నింటికంటే ముఖ్యంగా జయ జానకి నాయక సినిమా అసలు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో కంపీట్ చేస్తున్న తీరును చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తొలి వారం పూర్తయ్యేసరికి 18.6+ కోట్లతో నేనే రాజు నేనే మంత్రి దూసుకుపోతుంటే.. జయ జానకి సినిమా ఇదే వారంలో 16.2+ కోట్లు వసూలు చేసింది. అవతల సినిమాలో రానా వంటి పెద్ద స్టార్ ఉన్నా.. ఇవతల సినిమాలో శ్రీనివాస్ వంటి లెస్ పాపులర్ హీరో ఉన్నా కూడా.. ఆల్మోస్ట్ అదే రేంజులో కలక్షన్లను వసూలు చేయడం అంటే పెద్ద విషయమే. అదంతా ఖచ్చితంగా బోయపాటి ఖాతాలోనే వేయాలి మరి. మనోడికి మాస్ పల్స్ తెలిసినట్లు మరే దర్శకుడికీ తెలియదని ఈ సినిమాకు బి అండ్ సి సెంటర్లలో వస్తున్న కలక్షన్లే నిదర్శనం. అందుకే బోయపాటి రేంజ్ ఏంటో అర్దం చేసుకోండి అంటున్నారు ట్రేడ్ పండితులు. ఆల్రెడీ గతంలో సరైనోడు విషయంలో ఇదే విధంగా ప్రూవ్ చేసేశాడు బోయపాటి. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ చేశాడు.

మరో విషయం ఏంటంటే.. జయ జానకి నాయక సినిమాకు నేనే రాజు తో పోలిస్తే వారంలో నైజాంలోనే దాదాపు 2 కోట్లు తక్కువొచ్చింది. మిగిలిన అన్ని సెంటర్లలోనూ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సమానంగా వసూలు చేసింది. అంటే నైజాంలో దిల్ రాజు రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేశారు కాబట్టి.. ధియేటర్లను సర్ధుబాటు చేయలేకపోయారనే అనుకోవాలి. పైగా చాలా ధియేటర్లు నేనే రాజు నేనే మంత్రి ఖాతాలోకి వెళిపోయాయ్ కాబట్టి.. బోయపాటి ఇక్కడ కాస్త తక్కువగా వసూలు చేసుండొచ్చు.
Tags:    

Similar News