ఇప్పటివరకు సరైన హీరోయిజం తెరపై చూపించలేకపోయినా రానా దగ్గుబాటి.. బాహుబలి సినిమాతో మాత్రం భల్లాలదేవ అంటూ విలనీ బాగానే పండించాడు. అందుకే అలాంటి షేడ్స్ ఒక పాత్రను హీరోగా చూపిస్తే రానా అందులో ఎలా ఉంటాడు? బాగానే ఇమిడిపోతాడు అనిపిస్తోంది. తేజ డైరక్షన్లో రూపొందుతున్న 'నేనే రాజు నేను మంత్రి' సినిమా టీజర్ ను చూస్తే అలాగే అనుకోవాలి మరి.
చాలా కాలంగా షూట్లో ఉన్న ఈ సినిమా టీజర్ ను ఈరోజు దివంగత రామానాయుడు బర్తడే సందర్బంగా రిలీజ్ చేశారు. సంకెళ్లు వేసి జైల్లోకి తీసుకెళ్ళబడుతున్న రానా విజువల్స్ కాస్త డైనమిక్ గానే ఉన్నాయి. ఇక మనోడు అలా నడిచి వెళుతుంటే.. వాయిస్ ఓవర్ లో పోసాని డైలాగ్స్.. 'పుట్టిన వాడు మరణించకా తప్పదు.. మరణించిన వాడు పుట్టకా తప్పదు. ఆమెన్' అంటూ అటు భగవద్గీతకు ఇటు బైబిల్ ఎండింగ్ ఇచ్చాడు. ఇక ఊరికంపం ముందు నుంచున్న రానా.. 'నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా.. నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా.. నా జీవితానికి నేనే రాజూ నేనే మంత్రి' అంటూ భగవంతుడు రేంజిలో డైలాగ్ పేల్చాడు. టీజర్ వరకు బాగానే ఉంది మరి.
తేజ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే కొట్టాడు. ఇకపోతే కాజల్ అండ్ క్యాథరీన్ త్రెసా ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు.
Full View