ట్రైలర్ టాక్: జోగేంద్ర విజన్ వేరే ఉన్నట్లుందే!

Update: 2017-06-23 07:05 GMT
దగ్గుబాటి రానా ఈ ఏడాది ఇప్పటికే పవర్ ఫుల్ విలన్ గా మెప్పించేశాడు. బాహుబలి2లో భల్లాలదేవ పాత్రతో బోలెడన్ని మార్కులు పట్టేశాడు. ఇప్పుడు జోగేంద్ర పాత్రతో 'నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రానా. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి మూవీకి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

కొన్ని వారాలుగా జోగేంద్ర పాత్రను కొంచెం కొంచెం పరిచయం చేస్తూ ఆకట్టుకున్న మూవీ యూనిట్.. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జెడ్ గా ఆ పాత్ర గురించి రివీల్ చేసేసింది. జోగేంద్ర పాత్రలో రానా సూపర్బ్ గా ఒదిగిపోయాడు. స్టోరీ విషయానికి వస్తే.. హ్యాపీగా లైఫ్ గడిపేస్తున్న జోగేంద్ర తనకు జరిగిన దారుణం తర్వాత.. పాలిటిక్స్ పై దృష్టి పెడతాడు. 'లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం కుర్చీ నా xడ్డి' కింద ఉండాల'ని ఫిక్స్ అయిపోయి స్కెచ్ లు వేస్తాడు.

ఇందుకోసం అవసరమైతే ముఖ్యమంత్రిని ఎదిరించేందుకు కూడా వెనకాడడు. 'వందమందిని స్టార్ హోటల్ లో పెడితే సాయింత్రానికి నేను కూడా సీఎంనే' అంటూ డైలాగ్ పేల్చడం వంటివి.. రియల్ లైఫ్ పాలిటిక్స్ కు దగ్గరగా తీశాడని అనిపిస్తాయి. 'పాముకు పుట్ట కావాలంటే చీమలే కదా కష్టపడాలి' డైలాగ్ తో ట్రైలర్ ఫినిష్ చేయడం ఆకట్టుకుంటుంది. చూసేందుకు నెగిటివ్ గా కనిపిస్తున్నా.. వేరే ఇంటెన్షన్, విజన్ తో హీరో పాత్ర ఇలా ప్రవర్తిస్తోందనే సంగతి అర్ధం చేసుకోవచ్చు.

మొత్తం మీద ట్రైలర్ ప్రామిసింగ్ గానే ఉంది. విజువల్స్ కూడా రిచ్ గా ఉన్నాయి. కానీ ఇదే టెంపోను సినిమా అంతా మెయింటెయిన్ చేస్తాడా.. ఇంతకీ ఉరికంబానికి రానాకి లింక్ ఏంటి.. ట్రైలర్ మొదట్లో వినిపించే చరిత్ర చూపిచడం డైలాగ్ కు అర్ధమేంటి లాంటి సస్పెన్స్ లను బాగానే వదిలాడు. ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాత్ర స్టోరీకి కీలకమే అయినా.. నిడివి తక్కువగా ఉండేట్లుగా కనిపిస్తోంది.

Full View
Tags:    

Similar News