వారం రోజుల్లో పెట్టుబడి తెచ్చేశాడు

Update: 2017-02-11 05:34 GMT
‘నేను లోకల్’ సినిమాకు నాని కెరీర్లోనే అత్యధికంగా బిజినెస్ జరిగింది. బిజినెస్ రూ.20 కోట్లు దాటగా.. పబ్లిసిటీ ఖర్చులతో కలిపితే ఈ చిత్రం రూ.22 కోట్లు వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్‌ కు వచ్చే పరిస్థితి. నాని ఎంత ఊపులో ఉన్నప్పటికీ ఈ సినిమా అంత వసూలు చేయగలదా అని చాలామంది సందేహించారు. కానీ నాని సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి వారాంతంలోనే ఏకంగా ఈ చిత్రం రూ.15 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. వీక్ డేస్ లో కూడా పెద్ద వీక్ కాకుండా మంచి వసూళ్లతో దూసుకెళ్లింది. వారం రోజులు తిరిగేసరికే ‘నేను లోకల్’ పెట్టుబడి మొత్తం వెనక్కి తెచ్చేసి.. లాభాల బాట పట్టేసింది.

సరిగ్గా వారం రోజులకు ‘నేను లోకల్’ రూ.22.12 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ రూ.35 కోట్లకు చేరుకుంది. నైజాం ఏరియాలో రూ.7 కోట్ల షేర్ రాబట్టిన ‘నేను లోకల్’.. సీడెడ్లో రూ.2.25 కోట్లు వసూలు చేసింది. వైజాగ్ ఏరియాలో రూ.2.43 కోట్లు వచ్చాయి. పశ్చిమగోదావరిలో రూ.1.01 కోట్లు.. తూర్పు గోదావరిలో రూ.1.6 కోట్లు.. గుంటూరులో రూ.1.3 కోట్లు.. నెల్లూరులో రూ.47 లక్షలు వసూలయ్యాయి. మొత్తంగా ఆంధ్రాలో రూ.8.12 కోట్ల షేర్ కలెక్టయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపితే రూ.17.41 కోట్ల షేర్ వసూలు చేసింది ‘నేను లోకల్’. ఇక అమెరికాలో మిలియన్ క్లబ్బుకు చేరువగా ఉన్న ఈ చిత్రం రూ.2.53 కోట్ల షేర్ తెచ్చిపెట్టింది. కర్ణాటకలోనూ రూ.1.43 కోట్ల షేర్ తో సత్తా చాటాడు నాని. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. రెండో వారం నుంచి వచ్చేదంతా లాభాలే అన్నమాట
Tags:    

Similar News