బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పి నాలిక్కర్చుకున్న నెట్‌ ఫ్లిక్స్‌?

Update: 2020-04-08 13:00 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కి చెందిన ప్రముఖులందరూ బన్నీకి బర్త్ డే విషెస్ చెప్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చిత్రంలో నటిస్తున్నాడు. బన్నీ పుట్టినరోజు ఈ చిత్రానికి సంభందించిన టైటిల్ మరియు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. దీనికి అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తున్నది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురంలో' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత రోజుల్లో ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ ఫ్లిక్స్‌ లో విడుదల అవ్వగా..అక్కడ కూడా ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాకుండా ఇండియాలో కొన్ని వారాలపాటు నెట్‌ ఫ్లిక్స్‌ లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగింది. నెట్‌ఫ్లిక్స్‌ ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే దీనికి అల్లు అర్జున్ అభిమానులు నెట్‌ ఫ్లిక్స్‌  పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బర్త్ డే విషెస్ చెప్తే విరుచుకుపడటమేందని ఆలోచిస్తున్నారా..!  నెట్‌ ఫ్లిక్స్‌ వాళ్ళు బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తే ఫ్యాన్స్ సంతోషించే వాళ్లే.. కానీ వీళ్ళు సోషల్ మీడియా వేదికగా '' ఈ అందమైన బుట్ట బొమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు'' అంటూ ట్వీట్ చేసారు.

'బుట్ట బొమ్మ' అనే పదం సాధారణంగా అమ్మాయిలకి వాడే ఉపవాచకమని నెట్‌ ఫ్లిక్స్ టీంకి తెలియదనుకుంటా పాపం.. బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఇదే దొరికిన సందనుకొని యాంటీ అల్లు ఫ్యాన్స్ దీన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. జరిగిన మిస్టేక్ గ్రహించిన నెట్‌ ఫ్లిక్స్ టీమ్ కేవలం 6 నిమిషాల్లో ట్వీట్‌ ను తొలగించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిమిషాల్లో నెట్‌ ఫ్లిక్స్ బృందాన్ని ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. అయితే కొంత సమయం తర్వాత నెట్‌ ఫ్లిక్స్ మరొక ట్వీట్‌ తో వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకొనే ప్రయత్నం చేసారు. ఈసారి ''మనకి బుట్ట బొమ్మ పాట నేర్పిన - స్కార్ఫ్ ఫైట్ అండ్ బోర్డ్‌ రూమ్ డాన్స్ మూమెంట్స్ నేర్పించిన అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు'' అంటూ ట్వీట్ చేసారు. ఏదేమైనా మంచికి పోతే చెడు ఎదురొచ్చిందనే సామెత ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వాళ్లకి కరెక్టుగా సరిపోతుందని చెప్పవచ్చు. సెలెబ్రెటీలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని వాళ్లకి తెలిసొచ్చి ఉంటది.


Tags:    

Similar News