టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ లు, సూపర్ హిట్ లు నిలిచిన సినిమాలని హిందీలో రీమేక్ చేయాలని బాలీవుడ్ వర్గాలు పోటీపడుతుంటే మన వాళ్లు మాత్రం మలయాళ ఇండస్ట్రీ వెనక పడుతున్నారు. అక్కడ సూపర్ హిట్ అనిపించుకున్న సినిమాలపై కన్నేసిన మన వాళ్లు వాటిని తెలుగులో బ్యాక్ ట బ్యాక్ రీమేక్ చేస్తూ వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి సిద్ధూ జొన్నలగడ్డ వరకు మలయాళ రీమేక్ లంటే ఆసక్తిని చూపిస్తూ వాటి కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే తెలుగులో చాలా వరకు మలయాళ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'ని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇదే పంథాలో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'లూసీఫర్'రీమేక్ లో నటిస్తున్నారు. 'గాడ్ ఫాదర్' గా తెరకెక్కుతున్నఈ మూవీని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు. దసరాకు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీటితో పాటు రీసెంట్ గా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'కప్పెల' మూవీని సీతార ఎంటర్ టైన్ మెంట్స్ వారు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే మన వాళ్ల కన్ను తాజాగా మరో మలయాళ హిట్ ఫిల్మ్ పై పడింది. 'మిన్నాళ్ మ ఉరళి' ఫేమ్ టివినో థామస్ హీరోగా నటించిన 'తళ్లుమాల' రీసెంట్ గా విడుదలై మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఏకంగా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు కొల్లగొట్టిందట. దీంతో మన వాళ్లు దృష్టి ఈ మూవీపై పడింది. వెంటనే తెలుగు రీమేక్ రైట్స్ ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రూ. 85 లక్షలకు కొనేసింది.
'కప్పెల' రీమేక్ లో నటించాల్సిన సిద్దూ జొన్నలగడ్డ నెగెటివ్ క్యారెక్టర్ కావడంతో ఆ మూవీ నుంచి తప్పుకున్నాడు. తనతో 'తళ్లుమాల' రీమేక్ ని చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లకుండానే మేకర్స్ కి నెట్ ఫ్లిక్స్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. రీసెంట్ గా ఈ మూవీ స్ట్రిమింగ్ హక్కుల్ని సొంతం చేసుకుని స్ట్రిమింగ్ మొదలు పెట్టిన నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీంతో తెలుగు రీమేక్ చేయాలని రైట్స్ తీసుకున్న వారికి ఇది పెద్ద తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో వుండటంతో తెలుగు ప్రేక్షకులు ఎగబడి చేస్తున్నారట. ఈ నేపథ్యంలో తెలుగు రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నవారు ఈ విషయాన్ని ఎలా మర్చిపోయారని, ఓటీటీకి సంబంధించిన కూడా అగ్రిమెంట్ చేసుకుని వుంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కావనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఈ సమస్యని రీమేక్ హక్కుల్ని దక్కించుకున్న మేకర్స్ ఎలా అధిగమిస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.