'ఛలో' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఎదుగుదల గురించి తెలిసిందే. తొలి అవకాశం చిన్నదే అయినా ఆ సక్సెస్ ఎన్నో అవకాశాలకు దారులు వేసింది. దీనికితోడు సొగసరి అందం..అభినయం..ప్రతిభ కలిసొచ్చాయి. అప్పటివరకూ కన్నడలో నత్తనడకన సాగిన కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. 'గీతగోవిందం'..'సరిలేరు నీకెవ్వరు'..'భీష్మ' లతో వరుస విజయాలు ఖాతాలో వేసుకుంది.
అటుపై 'పుష్ప ది రైజ్' తో ఏకంగా పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. ఏ పరిశ్రమలోనై,నా ఇలా ఎదగాలంటే ప్రతిభ ఉంటే సరిపోదు. దానికి అదృష్టం కూడా కలిసి రావాలని చాలా మంది చెబుతుంటారు. రష్మక విషయంలో కెరీర్ ఆరంభంలోనే ఆ ఫీచర్స్ అన్ని జనాలకి కనిపించాయి. అందుకే ఆ భామ సక్సెస్ ని నెటి జనులు ముందే గెస్ చేసారు.
వాళ్లు అనుకున్నట్లుగానే రష్మిక పెద్ద హీరోయిన్ అయింది. పిట్ట చిన్నదే అయినా కూత ఘనమైన మాదిరి దూసుకుపోతుంది. టాలీవుడ్ తో పాటు..ఇటీవలే బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది. అక్కడా సత్తా చాటాలని కసి పట్టుదలతో ముందుకెళ్తుంది. తాజాగా ప్రేక్షకుల అంచనాల్ని అన్నింటిని కరెక్ట్ అంటోంది రష్మిక. '' నేను అదృష్టాన్ని..హార్డ్ వర్క్ ని రెండింటిని నమ్ముతా.
నా జీవితంలో రెండ సమానంగా ఉంటాయి. కెరీర్ తొలి నాళ్ల నుంచి ఇప్పటివరకూ సినిమాల విషయంలో నేనెప్పు డు ఎదురుచూడలేదు. కన్నడలో సినిమా చేస్తున్నప్పుడే 'ఛలో'లో అవకాశం వచ్చింది. అది చేస్తుండగానే 'గీత గోవిందం'లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా చేస్తుండగానే 'దేవదాస్' లో అవకాశం వచ్చింది.
ఇప్పుడు హిందీలో ఒక్క చిత్రం కూడా రిలీజ్ కాకుండా అవకాశాలు వస్తున్నాయి. ఇలా వరుసగా అవకాశాలు వస్తున్నాయంటే? కారణం వాటి వెనుక నా కష్టం...అదృష్టం మాత్రమే ఉన్నాయని నమ్ముతా. సరైన కథలు వస్తున్నప్పుడు అన్ని వాటంతటవే జరిగిపోతుంటాయి. ఈ విషయంలో నేను చాలా లక్కీ అని చెబుతాను' అంటోంది.
మొత్తానికి రష్మిక విషయంలో ఇలా జరగడాదనికి జనాలు ముందుగానే గమనించారు. ఇక పాత్రల పరంగానూ రష్మిక రోల్స్ లో వేరియషన్స్ కనిపిస్తున్నాయి. ఒకే జానర్ సినిమాలకు పరిమితం కాకుండా డిఫరెంట్ గా ఉండే పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ సక్సెస్ లో భాగమవుతుంది. ఇమేజ్ చట్రంలో ఇమిడిపోకుండా...కంపర్ట్ జోన్ దాటొచ్చి అన్ని రకాల జానర్లలో రష్మిక సినిమాలు చేస్తుంది. ఓస్టార్ హీరోయిన్ అయి ఉండి ఇటీవల విడుదలైన 'సీతారామం' సినిమాలో ఆఫ్రీన్ పాత్రలోనూ మెప్పించిన సంగతి తెలిసిందే.