తేజూ యాక్సిడెంట్‌.. 'చిత్రలహరి' చర్చ

Update: 2021-09-12 03:48 GMT
మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ యాక్సిడెంట్ విషయం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో.. ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో తెగ చర్చకు తెర తీస్తుంది. సాయి ధరమ్‌ తేజ్ యాక్సిడెంట్‌ విషయంలో పలువురు పలు రకాలుగా అనుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం రేసింగ్ కాదు.. స్పీడ్‌ గా కూడా లేడు రోడ్డు పై ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయ్యాడు.. ఆ సమయంలో ఆయన కనీసం డ్రింక్ కూడా చేసి లేడు అంటూ తేల్చి చెప్పారు. కనుక ఇదో సాదారణ యాక్సిడెంట్ అంటూ క్లారిటీ వచ్చేసింది. కొందరు మాత్రం ఇష్టానుసారంగా పుకార్లు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే సాయి ధరమ్‌ తేజ్ యాక్సిడెంట్ నేపథ్యంలో ఆయన నటించిన చిత్రలహరి సినిమా గురించిన చర్చ నడుస్తోంది.

చిత్రలహరి సినిమాలో హీరో పాత్ర అయిన సాయి ధరమ్‌ తేజ్ యాక్సిడెంట్ అయిన సమయంలో చుట్టు పక్కల ఎవరు లేకుంటే సాయం పొందేందుకు ఒక డివైజ్ ను తయారు చేస్తాడు. ఆ డివైజ్ తో సాయం పొందే వీలు ఉంటుంది. యాక్సిడెంట్ అయిన సమయంలో అందులో ఉండే డివైజ్‌ తో యాక్సిడెంట్‌ విషయం తన వారికి తెలిసేలా చేస్తుంది. దాంతో సాయం చేసేందుకు వారు ముందుకు వస్తారు అనేది కాన్సెప్ట్. చిత్రలహరి లో చుట్టు ఎవరు లేనప్పుడు ఆ డివైజ్ అవసరం అవుతుంది. అయితే తేజూ కు యాక్సిడెంట్ అయిన సమయంలో వెంటనే పదుల సంఖ్యలో అక్కడ చుట్టు ముట్టారు. ఆయన్ను వెంటనే 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. తేజూ ను తరలించడం ఆలస్యం అయ్యి ఉంటే ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండేది అనడంలో సందేహం లేదు. జనాల మద్య యాక్సిడెంట్‌ అయ్యింది కనుక పర్వాలేదు.. జనాలు లేని చోట అయితే ఆ సమయంలో చిత్రలహరి సినిమాలో చూపించినటువంటి డివైజ్ ఒకటి ఉండటం చాలా మంచిది. సినిమా లో చూపించిన ఆ కాన్సెప్ట్‌ ను వెంటనే ఇంప్లిమెంట్ అయ్యేలా టెక్ పరిశోదకులు చూడాలని నెటిజన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక సాయి ధరమ్‌ తేజ్ సినిమాల విషయానికి వస్తే దేవ కట్టా దర్శకత్వంలో నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇటీవలే ఈ సినిమా కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చిన తేజూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాడు. విభిన్నమైన పాత్రలను పోషించడంతో పాటు దేశ భక్తి ఉన్న పాత్రల విషయంలో చాలా ఆసక్తిగా ఉండే సాయి ధరమ్‌ తేజ్ ముందు ముందు మరిన్ని మంచి కాన్సెప్ట్‌ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్‌ లను ఎంపిక చేసుకుంటున్నాడు. రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ గా సాయి ధరమ్‌ తేజ్ కనిపించబోతున్నాడు. ఇక ఆయన పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సేవా కార్యక్రమాలే ఆయన్ను కాపాడాయి అంటూ సన్నిహితులు అంటున్నారు.
Tags:    

Similar News