సుశాంత్ మరణంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ విపరీతంగా స్పందిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఒకే విషయం గురించి ట్విట్టర్ లో ఇంతగా ఇండియన్స్ చర్చించడం ఇదే ప్రథమం. చాలా మంది సుశాంత్ మృతికి సంతాపం తెలియజేస్తూ రెస్ట్ ఇన్ పీస్ అంటూ ట్వీట్ చేస్తూ ఉండగా మరికొందరు మాత్రం సుశాంత్ కు ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేసిన కొందరు బాలీవుడ్ వర్గాల వారిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు.
ముఖ్యంగా ఈ సమయంలో బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ మరియు ఆలియా భట్ లపై నెటిజన్స్ ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. బంధుప్రీతి మరియు ఫెవరేటిజంతో కరణ్ జోహార్ వారసులకు మాత్రమే సినిమా ఛాన్స్ లు ఇవ్వడం.. ఇతరులను ఎదగకుండా అడ్డు పడటం వంటివి చేస్తాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కంగనా రనౌత్ ఈ విషయమై కొన్నాళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరణ్ జోహార్ పై ఆ సమయంలో కంగనా చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు చాలా మంది సమర్ధిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.
సినీ నటుడు కేఆర్కే ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం కంటే ఎవరిని అయినా సాయం అడిగి ఉంటే బాగుండేది అంటూ ఇప్పుడు చాలా మంది అంటున్నారు. సాయం చేస్తామంటున్న వారు అంతా కూడా అబద్దాలు ఆడుతున్నారు. బాలీవుడ్ లో ఏ ఒక్కరు కూడా బయటి నుండి ఇండస్ట్రీకి వచ్చిన వారికి సాయం చేసేందుకు ముందుకు రారు. ఇక ఆర్థిక సాయం సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బయటి నుండి వచ్చిన వారు ఎవరి సమస్యలపై వారు పోరాటం చేసుకోవాల్సిందే.
సుశాంత్ మరణంపై పలువురు స్టార్స్‌తో పాటు ఆలియా భట్ కూడా స్పందించింది. ఈ విషయం నాకు చాలా షాకింగ్ గా ఉంది. నాకు మాట రావడం లేదు. నీవు మమ్ములను చాలా తొందరగా వదిలి వెళ్లి పోయావు అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కు చాలా మంది స్పందించారు. గతంలో సుశాంత్ రాజ్ పూత్ అంటే ఎవరో నాకు తెలియదు అంటూ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు.
చనిపోయిన వెంటనే నటిస్తూ మీడియా ముందుకు వచ్చేస్తారు. నీ నటన ఇక చాలు ఆపు అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు ఏ ఒక్కరు అయినా సుశాంత్ గురించి సరైన సమయంలో స్పందించి ఉంటే ఆయనకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.