షారుఖ్ ఖాన్ నటించిన కొత్త సినిమా ‘పఠాన్’ టీజర్ బుధవారం భారీ అంచనాల మధ్య రిలీజైంది. ఆ టీజర్లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ తాలూకు గ్లింప్స్, విజువల్ ఎఫెక్ట్స్ చూసి ఆహా ఓహో అనేస్తున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు. షారుఖ్ అభిమానుల ఉత్సాహం అయితే మామూలుగా లేదు. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి యాక్షన్ అడ్వెంచర్ రానే లేదు అన్నట్లుగా హైప్ ఇస్తున్నారు.
అక్కడి క్రిటిక్స్, ట్రేడ్ పండిట్లు కూడా ‘పఠాన్’కు ఇస్తున్న ఎలివేషన్ మామూలుగా లేదు. కానీ మూణ్నాలుగేళ్లు వెనక్కి వెళ్తే ‘సాహో’ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా నుంచి ఒక్కో ప్రోమో రిలీజవుతుంటే యాక్షన్ ప్రియుల ఒళ్లు జిల్లుమంది.
నభూతో నభవిష్యత్ అన్నట్లుగా అందులో చూపించిన యాక్షన్ విజువల్స్ చూసి ఒక్కొక్కరికి కళ్లు చెదిరిపోయాయి. ప్రభాస్ ఆ ప్రోమోల్లో ఎంత స్టైలిష్‌గా కనిపించాడో.. కొన్ని మూమెంట్స్ ఎలా గూస్ బంప్స్ ఇచ్చాయో అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే ప్రోమోల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కేక పుట్టించింది.
ఐతే ఇన్ని ఆకర్షణలు ఉంటేనేమి.. కథాకథనాలు బలహీనంగా ఉండడం, ముఖ్యంగా ద్వితీయార్ధంలో కథనం గాడి తప్పడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ‘బాహుబలి’ తర్వాత ఆకాశానికి చేరిపోయిన ప్రభాస్ ఇమేజ్‌ను మ్యాచ్ చేయడంలో యువ దర్శకుడు సుజీత్ కొంచెం తడబడ్డాడు. నిజాకికి ‘సాహో’ కథను, ఆ సినిమాను, దాని టీం పడ్డ కష్టాన్ని తీసిపడేయలేం. చాలా ఎఫర్టే పెట్టారు.
వారి శ్రమ తెరపై కనిపించింది. భారతీయ ప్రేక్షకులకు ఒక నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ ఇద్దామని ప్రయత్నించారు. కానీ అదనపు ఆకర్షణల మీద పెట్టి శ్రద్ధ.. కథ మీద పెట్టలేదు. దీంతో ఫలితం తేడా కొట్టింది. కానీ తర్వాత తర్వాత ‘సాహో’ చూసిన వాళ్లు అంత డిజాస్టర్ కావాల్సిన సినిమా ఏమీ కాదని.. కొంచెం జాగ్రత్త పడి ఉంటే సినిమా వేరే లేవెల్లో ఉండేదని అభిప్రాయపడ్డారు. ‘పఠాన్’ టీజర్ రిలీజ్ సందర్భంగా చాలామంది దీంతో ‘సాహో’ను పోల్చి అందులోని ప్లస్ పాయింట్లను గుర్తు చేసుకుంటున్నారు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ఎఫెక్ట్స్ విషయంలో ‘సాహో’తో పోలిస్తే ‘పఠాన్’ దిగువనే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. సుజీత్ అండ్ టీం ఇంకాస్త శ్రద్ధ పెడితే ‘సాహో’ నిజంగా వేరే లెవెల్ సినిమా అయ్యేదే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.