వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఈమద్య కాలంలో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా కనీసం అభిమానులను కూడా ఆకట్టుకోలేక పోయింది. తన ప్రతి సినిమాకు ఆహా ఓహో అంటూ ప్రమోషన్ చేసే వర్మ ఏ సినిమాలో కూడా కంటెంట్ పరంగా మెప్పించలేక పోతున్నాడు. ఈమద్య కాలంలో వర్మ తాను దర్శకత్వం వహించకుడా ఇతరులతో సినిమాలు చేయిస్తున్నాడు. నిర్మాతగా లేదా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాను అంటూ చెబుతున్నాడు. కాని దర్శకత్వం చేసేది ఆయనే అనేది కొందరి మాట. నిన్న కరోనా వైరస్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనాకు ఎంత భయపడుతున్నారో జనాలు వర్మ కరోనా వైరస్ ను చూడాలన్నా అంతే భయపడుతున్నారు.
కరోనా వైరస్ కు బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. మరీ నాసిరకంగా ఉందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పటిలాగే వర్మను నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ వర్మకు ఈ సమయంలో ఒక సలహా ఇచ్చారు. 'హలో ఆర్జీవీ కొత్త ఆలోచనలు కోసం వోడ్కను వదిలేసి జిన్ ట్రై చేయ్యి' అంటూ కామెంట్ పెట్టాడు. వోడ్క తో నీలో కొత్త ఆలోచనలు రావడం లేదు మరోటి ట్రై చేసి అప్పుడు ఆలోచించు ఏమైనా బెస్ట్ వస్తాయేమో అంటూ చాలా మంది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వర్మ తన స్థాయిని తానే సినిమాకు సినిమాకు దింపేసుకుంటూ ముందుకు పోతున్నాడు అనిపిస్తుంది.