సరైన టైమ్ లో బరిలోకి దిగడం, సరైన కంటెంట్ తో మూవీని రెడీ చేయడం ఈ విషయాల్లో ఎపుడూ టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున ముందుంటారు. ఆయన ఎపుడో చెప్పారు. 2022 సంక్రాంతికి వస్తానని. అయితే ఆ తరువాత పరిణామాలు మారాయి. రాధేశ్యామ్ బరిలో నిలవడంతో పాటు అనూహ్యంగా ట్రిపుల్ ఆర్ కూడా దసరా నుంచి తప్పుకుని జనవరి7న లాండ్ అయింది. ఇక భీమ్లా నాయక్ కూడా ఉంటానని చెప్పేసింది. ఈ సిట్యువేషన్ లో నాగ్ బంగార్రాజు రావడం డౌటే అని అంతా అనుకున్నారు. పైగా మొండిగా వచ్చినా కూడా థియేటర్లతో ప్రాబ్లం అవుతుంది అని భావించారు.
అయితే జనవరి ఎంట్రీ ఇస్తూనే ఈ సమస్యలు అన్నీ మబ్బుల్లా తేలిపోయాయి. కాస్తా ముందే భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అయింది. ఇక ట్రిపుల్ ఆర్ సైతం రాలేనని చెప్పేసింది. ముచ్చటగా మూడవ సినిమా రాధేశ్యామ్ అయితే కుదరదు అంతే అనుకుని వాయిదాను నమ్ముకుంది.ఇక సంక్రాంతికి చూస్తే రేసులో ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. సరిగ్గా ఇక్కడే నాగ్ కి లక్ అలా కలసివచ్చింది.
బంగార్రాజు మూవీ పూర్తి గ్రామీణ నేపధ్యం కలిగిన చిత్రం. పెర్ఫెక్ట్ గా సంక్రాంతికి సూట్ అయ్యే మూవీ. ఇక దీనికి ముందు అంటే 2016 సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన కూడా బంపర్ హిట్ అయి నాగ్ ని 50 కోట్ల క్లబ్ లో చేర్చింది. సీక్వెల్ గా వస్తున్న బంగార్రాజు మూవీ కచ్చితంగా నాగ్ ని వంద కోట్ల క్లబ్ లో చేర్చినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.
మరో వైపు జీ స్టూడియోస్ వారి తో కలసి నాగ్ ఈ మూవీ నిర్మించాడు. జీ స్టూడియోస్ వారి కండిషన్ ఏంటి అంటే జనవరిలోనే ఈ మూవీ రిలీజ్ చేయాలని. దాంతో నాగ్ ఇప్పటిదాకా కాస్తా టెన్షన్ పడినా అనుకున్నట్లుగా సంక్రాంతికే జనవరి 14న ఈ మూవీని తెస్తున్నాడు. ఒక వైపు నాగార్జున రమ్యక్రిష్ణతో రొమాన్స్ చెస్తే కృతి శెట్టితో నాగ చైతన్య పండించే ప్రేమ మూవీకి హైలెట్ అంటున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది.
ఇక ఈ మూవీకి అపుడే పాజిటివ్ బజ్ వీర లెవెల్ లో ఉంది. ఈ మూవీ నైజాం హక్కుల కోసం దిల్ రాజు పోటీకి వస్తున్నాడు అంటేనే బంగార్రాజు పట్టిందల్లా బంగారం అనే తేలిపోతోంది. పండుగ నాలుగు రోజులూ ఈ మూవీ టోటల్ గా కలెక్షన్లు కుమ్మేసుకోవచ్చు. థియేటర్లు కూడా ఎన్ని కావాలంటే అన్నీ అందుబాటులో ఉంటాయి. మొత్తానికి ఇదంతా చూసిన వారు లక్ అంటే నాగ్ దే అనేస్తున్నారు. సో బంగార్రాజు సంక్రాంతి హీరో అని ముందే చెప్పేయవచ్చు. ఇక నాగార్జున తొలి వంద కోట్ల బొమ్మగా రికార్డు క్రియేట్ చేయడం డ్యామ్ ష్యూర్ అని అంటున్నారు. మరి ఇదంతా చూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ జోష్ మాటల్లో చెప్పగలమా..