ఈ సంక్రాంతి బరి నుంచి భారీ పాన్ ఇండియా సినిమాలు వైదొలగడంతో అన్నీ చిన్న సినిమాలే విడుదలవుతున్నాయి. అయితే ఇన్ని చిన్న సినిమాల నడుమ సంక్రాంతి అల్లుడిలా బంగార్రాజు వస్తున్నాడు. కింగ్ నాగార్జున లాంటి అగ్ర హీరో నటించిన ఈ సినిమాపై అంచనాలున్నాయి. ఇతర అగ్ర హీరోలంతా ఏపీలో సినిమా టికెట్ రేట్ల డైలమా.. ఓమిక్రాన్ టెన్షన్స్ నడుమ తమ సినిమాల్ని వాయిదా వేసుకుంటే నాగార్జునలో ఆ టెన్షన్స్ ఏవీ కనిపించడం లేదు.
అంతేనా ఆయన ఇటీవల తన ఈవెంట్లో చేసిన కామెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు సహా నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంలో ఇండస్ట్రీ గుర్రుమీద ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేరుగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కౌంటర్లు వేశారు. సిద్ధార్థ్ .. నాని లాంటి హీరోలు వెనక్కి తగ్గలేదు. ఆర్జీవీ సైతం ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చాలా మంది ఏపీ టికెట్ రేట్లతో సంతృప్తిగా లేరు.
అయితే కింగ్ నాగార్జున మాత్రం తన సినిమా చిన్న టికెట్ రేటుతో కూడా ఏ ఇబ్బందీ లేకుండా బాగానే ఆడుతుందని వ్యాఖ్యానించారు. దీంతో.. పరోక్షంగా జగన్ గవర్నమెంట్ నిర్ణయాలను నాగ్ ఎంకరేజ్ చేసారనేది ఇతరుల కామెంట్. నెటిజనుల్లో దీనిపై పెద్ద డిబేట్ సాగుతోంది. చాలా మంది పెద్ద హీరోల అభిమానులు నాగార్జునపై గుర్రుమీదున్నారు. అంతేకాదు.. బంగార్రాజు సినిమాపై ఏపీ ఎగ్జిబిటర్లు గుర్రుమంటున్నారని కథనాలొచ్చాయి. ఏపీలో థియేటర్ టిక్కెట్ల రేట్ల తగ్గింపుపై నాగార్జున స్పందనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న `బంగార్రాజు` విడుదలవుతుండగా ఇది బిగ్ డిబేట్ గా మారింది.తాజాగా నాగార్జున బంగార్రాజు వేదికపై నాగ్ మాట్లాడినది సరి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై నెటిజనులు కౌంటర్లు వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించడంపై నాగార్జునను మీడియా ప్రశ్నించగా.. ``నేను వేదికపై రాజకీయాలు మాట్లాడను. నా సినిమాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన్నారు. కానీ ఆయన మాటల్లో ``ఏపీలో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు`` అనడం చాలా మందిలో డౌట్లు రాజేసింది. నాగార్జున లాంటి టాప్ స్టార్ ఇలా వ్యాఖ్యానిస్తారని ఎవరూ ఊహించలేదు. పరిశ్రమ తరపున వకాల్తా పుచ్చుకుని ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచాలని ఆయన కోరతారనే అనుకున్నారు. కానీ ఆయన అలా అనేసరికి ఒక్కసారిగా ఖంగు తినడం ఇండస్ట్రీ వర్గాల వంతైంది.
కొందరైతే.. టికెట్ ధరల విషయంలో కింగ్ అంత లైట్ తీస్కున్నారు సరే.. ఆయన ఎన్-కన్వెన్షన్ సెంటర్ లో సామాన్యుల పెళ్లిళ్లకు అవకాశం కల్పిస్తారా? ఇక్కడ హై ప్రొఫైల్ ఈవెంట్లకు తప్ప స్థానం కల్పించరు. నాగ్ ఇది కూడా ఆలోచించాలి కదా! అని కొందరు నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. టిక్కెట్ ధరలు పెంచకుండా ఎగ్జిబిషన్ రన్ అయ్యేదెలా? పంపిణీ వర్గాలు బయ్యర్ల పరిస్థితేమిటి? థియేటర్ల మెయింటెనెన్స్ సహా ఇతర వ్యవహారాలు నిర్మాతగా నాగార్జునకు తెలియనివి కావు కదా! అంటూ పంచ్ లు వేస్తున్నారు. ఏపీ సీఎంతో సాన్నిహిత్యం ఉన్నా కానీ అలా మాట్లాడాల్సింది కాదు ఈ సందర్భంలో అని కొందరు సూచిస్తున్నారు. సోషల్ మీడియాల్లో ఇది పెద్ద డిబేట్ గా మారింది. నాగ్ వ్యాఖ్యలపై ఏపీ ఎగ్జిబిటర్లు ఇటీవల గుర్రుగా ఉన్నారని సమాచారం.