మంచు విష్ణు - కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ తెరకెక్కించిన చిత్రం ''మోసగాళ్ళు''. ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ ను మూటకట్టుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కథగా చెప్పుకుంటే థ్రిల్లింగ్ ఉన్నా దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే కామెంట్స్ వచ్చాయి.
నిజానికి గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణు ఈసారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలనుకొని.. స్వయంగా స్క్రిప్ట్ బాధ్యతలు చూసుకోవడమే కాకుండా భారీ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకొచ్చారు. వాస్తవ సంఘటన ఆధారంగా సినిమా తీస్తున్నాడని తెలియగానే అందరి దృష్టి 'మోసగాళ్ళు' పై పడింది. అయితే దీనికి హాలీవుడ్ దర్శకుడుని ఎందుకు తీసుకున్నారని అందరూ ఆలోచించారు. ఎందుకంటే ఇప్పుడు మన టాలీవుడ్ దర్శకులు పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ దర్శకులకూ కొదవలేదు. అయితే ఇక్కడి వారిని కాదని హాలీవుడ్ లో ఓ షార్ట్ ఫిలిం ని డైరెక్ట్ చేసిన వ్యక్తి చేతిలో 50 కోట్ల ప్రాజెక్ట్ ని చేతిలో పెట్టాడు విష్ణు. తీరా సినిమా విడుదలయ్యాక ఇలాంటి ఔట్ పుట్ కోసమేనా విష్ణు హాలీవుడ్ డైరెక్టర్ ని తీసుకుంది అని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రొడ్యూసర్ గా ఇప్పటికే చాలా సినిమాలు తీసిన విష్ణు.. 'మోసగాళ్ళు' కోసం మంచి పాయింట్ ని కథగా మలుచుకొని, భారీ క్యాస్టింగ్ ని పెట్టుకుని, డైరెక్టర్ విషయంలో మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి ఇదే కథను టాలీవుడ్ లోని ఏ యువ దర్శకుడి చేతిలో పెట్టినా అద్భుతంగా తీసేవారని విశ్లేషకులు అంటున్నారు. అయితే విష్ణు ఈ చిత్రాన్ని ముందుగా తెలుగు - ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే తీయాలి అనుకున్నారట. అందుకోసమే హాలీవుడ్ దర్శకుడిని తీసుకొని ఉండొచ్చు. కానీ చివరకు పాన్ ఇండియా మూవీగా విడుదలై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంది. హాలీవుడ్ నుంచి దర్శకుడుని తీసుకురావడం వల్ల విష్ణుకి ఏమి పప్రయోజనం చేకూరింది అని సినీ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే 'మోసగాళ్ళు' ఇంగ్లీష్ లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి అక్కడ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.