బర్త్ డే నాడు అల్లు అరవింద్ మందు బ్రాండ్ ని బయటపెట్టారంటున్న నెటిజన్స్..!
టాలీవుడ్ లో నాలుగున్నర దశాబ్దాలుకు పైగా అగ్ర నిర్మాతగా కొనసాగుతోన్న మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిన్న (జనవరి 10) తన పుట్టినరోజును జరుపుకున్నారు. దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య తనయుడిగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టి, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అరవింద్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ క్రమంలో రెండో కుమారుడు అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ ద్వారా తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపాడు. నీలాంటి తండ్రి నాకుండడం గొప్ప అదృష్టం అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు బన్నీ. ఇక చిన్న కొడుకు అల్లు శిరీష్ కూడా తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
అల్లు శిరీష్ ట్వీట్ చేస్తూ ''హ్యాపీ బర్త్ డే డాన్ కార్లేయన్. పబ్లిక్ లో మీ గురించి మాట్లాడే రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను'' అని పేర్కొన్నాడు. ఇక తండ్రి పుట్టినరోజు కోసం శిరీష్ ఓ స్పెషల్ కేక్ రెడీ చేయించాడని తెలుస్తోంది. ఆ కేక్ ని ఒక క్లాప్ బోర్డు - 'ఆహా' యాప్ మరియు గీతా ఆర్ట్స్ లోగోలతో పాటు వారి బ్యానర్ లో నిర్మించిన కొన్ని సినిమాలు కనిపించేలా డిజైన్ చేయించారు. అలానే కేక్ కి రెండు వైపులా రెండు మందు బాటిల్స్ పెట్టాడు. ఇప్పుడు ఇదే అందరినీ దీనిపై దృష్టి సారించేలా చేసింది. అల్లు శిరీష్ తన తండ్రికి ఇష్టమైన బ్రాండ్ ని బర్త్ డే కానుకగా ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా అల్లు అరవింద్ బ్రాండ్ ని కూడా బయటపెట్టారని సరదాగా పోస్టులు పెడుతున్నాడు. ప్రస్తుతం ఈ కేక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.