తమిళ నటుడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో కూడా కీలక పాత్రలో నటించాడు. అంతేకాకుండా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన' సినిమాలో కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. తన విలక్షమైన నటనతో అందర్నీ మెప్పిస్తూ మక్కల్ సెల్వన్ అనిపించుకుంటూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య ఓ టీవీ ఛానల్ లో హిందూ దేవుళ్లకు ఆగమ నియమాలను అనుసరించి జరిగే అభిషేకం.. అలంకరణ.. కైంకర్యాలను తప్పుబడుతూ విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నారు.
అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలపై అఖిల భారత హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై చెన్నై నగర పోలీసు కమిషనర్ కు ఒక లేఖ రాసింది. హిందూ దేవాలయాలను దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన విజయ్ సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరింది. విజయ్ సేతుపతి వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఆయన ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందని నిలదీసింది. పబ్లిసిటీ కోసం హిందూ మతమే దొరికిందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 17వ తేదీన విజయ్ సేతుపతి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా విజయ్ సేతుపతికి సంబంధించిన ట్రోలింగ్ కూడా సామాజిక మాధ్యమాల్లో జోరుగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ వివాదంపై ఇంకా విజయ్ సేతుపతి స్పందించలేదు. మరి ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.