ఇద్దరు స్టార్ హీరోల మల్టీ స్టారర్ అంటే అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటాయి.. ఆ అంచనాలకు తగ్గట్లుగా ఇతర దర్శకులు అయితే సినిమాను తీయలేరేమో కాని.. ఖచ్చితంగా జక్కన్న రాజమౌళి మాత్రం అద్బుతమైన సినిమాను చేస్తాడని ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు నమ్మకం వ్యక్తం చేశాడు. సినిమాలో అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ పాత్రలకు సంబంధించి రాజమౌళి సమ న్యాయం చేస్తాడని ప్రతి ఒక్కరు నమ్మకం పెట్టుకున్నారు.
మొదటి నుండి ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆమె చరణ్ కు జోడీగా కనిపించబోతుంది అంటూ ప్రచారం జరిగింది. రామరాజు మరదలు పాత్రలో సీతగా ఆలియా భట్ నటించబోతుందనే ప్రకటన వచ్చిన వెంటనే చరణ్ కు జోడీగా ఆలియా భట్.. కాని ఎన్టీఆర్ కి జోడీగా ఏ హీరోయిన్ లేదా అంటూ కొందరు అసహనం వ్యక్తం చేశారు. ఒలీవియా ఉన్నా కూడా ఆమె ఎన్టీఆర్ తో ఎంత సమయం కనిపిస్తుందనేది నమ్మకం లేదు.
విడుదల ముందు వరకు హీరోయిన్స్ విషయంలో జరిగిన ప్రచారం పూర్తిగా విభిన్నంగా విడుదల అయిన తర్వాత ఉంది. సినిమా హీరోయిన్స్ విషయంలో ప్రేక్షకులు నిన్నటి వరకు కూడా ఒక అంచనాతో ఉన్నారు. కాని సినిమా విడుదల అయిన తర్వాత అంచనాలు తారు మారు అయ్యాయి. అనూహ్యంగా రామ్ చరణ్.. ఆలియా భట్ జోడీ కంటే ఎన్టీఆర్.. ఒలివియా జోడీ కి ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ లభించింది.
సినిమా లో ఒలీవియా పాత్ర తో పోల్చితే ఆలియా భట్ పాత్ర చాలా తక్కువ అని చెప్పకన తప్పదు. ఆమె కథలో అత్యంత కీలకం అంటూ మొదటి నుండి ప్రచారం చేస్తూ వచ్చారు. కాని అంత సీన్ కూడా ఏమీ లేదు. ఒలీవియాకు కథలో అత్యంత కీలక పాత్ర ఉండటం తో పాటు ఎన్టీఆర్ తో ఆమె కథలో చాలా సమయం ట్రావెల్ చేసే పాత్ర లో కనిపించింది.
అంటే సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎన్టీఆర్ కే హీరోయిన్ తో అదిక సన్నివేశాలు ఉన్నాయి అనేది ప్రేక్షకుల టాక్. రామ్ చరణ్ పాత్ర సూపర్బ్ గా చూపించిన జక్కన్న ఆయనకు మరదలు సీత తో ఎక్కువ సన్నివేశాలను పెట్టలేక పోయాడు. ఆలియా భట్ ను కేవలం బాలీవుడ్ ప్రేక్షకుల కోసం తీసుకున్నట్లుగా అనిపించింది. ఆ చిన్న పాత్రకు ఆలియా భట్ అవసరమా అనే పెదవి విరుపు సాదారణ ప్రేక్షకుల్లో కనిపిస్తుంది.
అద్బుతమైన విజువల్ వండర్ గా సనిమా ను మల్చే క్రమంలో ఇద్దరు హీరోలకే ఎక్కువ స్కోప్ ఇచ్చిన జక్కన్ హీరోయిన్స్ విషయం లో కాస్త దోవ తప్పాడు అనిపించక మానదు. ముఖ్యంగా ఆలియా భట్ విషయంలో ఆమె ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ తప్పదు. ఓవరాల్ గా సినిమా సూపర్ అయినా కూడా పాయింట్స్ వైజ్ గా తీసుకుంటే హీరోయిన్ ఆలియా భట్ పాత్ర విషయంలో పెదవి విరుపుతు తప్పడం లేదు.. ఆ ఒక్క విషయంలో బ్యాడ్ టాక్ తప్పడం లేదు.