హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ విభిన్నమైన చిత్రాలతో హీరోగా ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత విరామం తరువాత ఆయన మరో సరికొత్త ప్రయత్నంతో తన అదృష్లాన్ని పరీక్షించుకోబోతున్నారు. నేడు రాజా గౌతమ్ పుట్టిన రోజు.
ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ని మేకర్స్ బుధవారం విడుదల చేశారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలని నిర్మిస్తూ వినూత్నమైన సినిమాలని అందిస్తున్న యస్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ నెం.10 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ చిత్రం ద్వారా సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బుధవారం విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. బ్లాక్ థీమ్ లో మొదలైన గ్లింప్స్ .. `ఒంటరి తనం ఎంత భయంకరంగా వుంటుందో తెలుసా` అంటూ గౌతమ్ వినిపించే డైలాగ్ తో ముగిసింది. ఈ గ్లింప్స్ లో గౌతమ్ లుక్ ని రివీల్ చేశారు. ఆర్టిస్ట్ పాత్రలో నటించి `మను` మూవీతో ఆకట్టుకున్న రాజా గౌతమ్ ఈ సారి మరో సరికొత్త కథతో మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది.
మోనో ఫోబియాతో బాధపడుతున్న ఓ రచయితగా రాజా గౌతమ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మార్చింది? .. తను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని తను ఎలా అధిగమించాడు? అనేది థ్రిల్లింగ్ గా వుండబోతోంది అని చిత్ర బృందం చెబుతోంది. ఈ కాన్సెప్ట్ ని తెరకెక్కించడంలో దర్శకుడు సుబ్బు చెరుకూరి తనదైన ప్రత్యేకతని చాటుకున్నాడని అంటున్నారు.
వినూత్నమైన కథతో కొత్త పంథాలో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఎమ్ ఎస్ జోన్స్ రూపెర్ట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజా గౌతమ్ చేస్తున్న సరి కొత్త ప్రయత్నం అతన్ని సక్సెస్ బాట పట్టించి హీరోగా నిలబెడుతుందా? అన్నది వేచి చూడాల్సిందే అంటున్నారు.