డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ ఫేట్ డిసైడ్ అయిపోయింది. వీకెండ్ పర్వాలేదు అనిపించినా నిన్నటి నుంచి రికార్డు అవుతున్న దారుణమైన డ్రాప్ బయ్యర్లకు నిద్రను దూరం చేసేలా ఉంది. కానీ యూనిట్ మాత్రం ఏదో ఒక రూపంలో హైప్ ని నిలబెడుతూ వసూళ్లు పెంచే దిశగా ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే కొంత వెర్షన్ ట్రిమ్ చేయడంతో పాటు యూత్ ప్రధానంగా కంప్లయింట్ చేసిన కాలేజీ క్యాంపస్ సాంగ్ ని జత చేసినట్టు తెలిసింది.
దీని గురించే ఇన్ డైరెక్ట్ గా హీరోయిన్ రష్మిక మందన్న ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ థియేటర్లలో మీకో స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశామని అదేంటో వెళ్లి చూడమని మీ ఫీడ్ బ్యాక్ ని బట్టి మార్పులు చేశామని వెళ్లి ఎంజాయ్ చేయమని కోరింది. అంటే ఆల్రెడీ చూసినవాళ్లను ఇంకోసారి లుక్ వేయమని అడిగేసింది. సరే ఇవన్నీ ఎన్ని చేసినా ఒక్కసారి ఫలితం వచ్చేసిన సినిమాకు ఎన్ని హంగులు జోడించినా పెద్దగా ఫలితం ఉండదు. ఎంత ట్రిమ్ చేసినా మెయిన్ కంటెంట్ లో ఉన్న లోపాల వల్ల డియర్ కామ్రేడ్ ఇప్పటికిప్పుడు నచ్చే సినిమాగా మారే ఛాన్స్ లేదు.
పైగా నిమిషంన్నర ఉండే క్యాంటీన్ సాంగ్ కోసం ఇంకో రెండు వందలు ఖర్చు పెట్టి మూడు గంటల సమయాన్ని ప్రేక్షకులు ఇస్తారా అంటే చిన్న పిల్లాడు కూడా సమాధానం చెప్తాడు. కానీ కామ్రేడ్ టీమ్ కు మాత్రం ఆశ ఇంకా మిణుకుమిణుకుమంటోంది. రష్మిక ట్వీట్ కి అప్పుడే కామెంట్స్ లో సెటైర్ల వర్షం కురుస్తోంది అది వేరే విషయం. మొత్తానికి విజయ్ దేవరకొండ రష్మికలు తమ శక్తికి మించి చేసిన ప్రమోషన్ సినిమాలోని వీక్ కంటెంట్ వల్ల ఓడిపోయింది. ఇప్పుడీ ట్వీట్లు ఏదో ఊరట కోసమే కానీ దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమి లేనట్టే. యుఎస్ లో మిలియన్ మార్క్ చేరుకోవడమే గగనంగా ఫీలవుతున్న కామ్రేడ్ ఫైనల్ స్టేటస్ రెండో వారం దాటగానే వచ్చేలా ఉంది