ఒకప్పటి సినిమా మేకింగ్ నిబంధనలకు ఇప్పటి నిబంధనలకు చాలా తేడాలు ఉన్నాయి. గతంలో జంతువులను మరియు పక్షులను సినిమా కోసం వినియోగించవచ్చు. కాని ఇప్పుడు జంతువులను సినిమా షూటింగ్ కోసం ఇబ్బంది పెట్టకూడదు అనే నిబంధన వచ్చింది. ఒక వేళ తప్పనిసరి అయ్యి షూటింగ్ లో జంతువులను వాడినా కూడా వాటికి ఎలాంటి ఇబ్బంది కలుగలేదు అనే విషయాన్ని సంబంధిత అధికారులతో దృవీకరణ పత్రం తీసుకు రావాల్సి ఉంటుంది. ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది ఉండేవారు. ఈమద్య కాలంలో మామూలుగానే చైల్డ్ ఆర్టిస్టులు కనిపించడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నియమంతో పిల్లలను సినిమాల్లో లేదా సీరియల్స్ లో చూడక పోవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సినిమా లో చిన్న పిల్లలను నటింపజేయడం అంటే అది ఖచ్చితంగా చైల్డ్ లేబర్ కిందకే వస్తుందని అంటున్నారు. డబ్బులు తీసుకుని పిల్లలు యాక్టింగ్ చేస్తున్నారు కనుక చైల్డ్ లేబర్ యాక్ట్ కిందకు వారిని తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. 14 ఏళ్ల లోపు పిల్లలను సినిమాల్లో నటింపజేయడానికి అనుమతించేది లేదు. ఒక వేళ అత్యవసరం అయ్యి సినిమా కోసం పిల్లలను ఉపయోగిస్తే తప్పనిసరిగా అవసరంను తెలియజేసి సంబంధిత జిల్లా కలెక్టర్ నుండి అనుమతులు తీసుకోవాల్సి ఉందట. ప్రభుత్వ అధికారి పర్యవేక్షణలో ఆ పిల్లాడు లేదా అమ్మాయి తో షూటింగ్ చేసుకోవాల్సి ఉంటుందట.
ఇక మీదట చిన్న పిల్లలు నటించిన సినిమాలు సెన్సార్ చేయాలంటే పిల్లలు నటించేందుకు గాను జిల్లా కలెక్టర్ కు సంబంధించిన అనుమతి పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా జంతువును షూటింగ్ కోసం వినియోగిస్తే అందుకు సంబంధించిన శాఖ అధికారుల వద్ద నో అబ్జక్షన్ పత్రం తీసుకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో పిల్లల అనుమతి కోసం కూడా కలెక్టర్ ల పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పత్రంను సెన్సార్ సమయంలో సమర్పించాల్సి ఉంటుందట. ఒక వేళ ఆ సర్టిఫికెట్ లేకుంటే మాత్రం సెన్సార్ క్లీయరెన్స్ ఇచ్చేది లేదు అంటూ ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయట. ఇది ఎంత వరకు అమలు అవుతుంది అనేది చూడాలి.