'సర్కార్‌' కు మరో దెబ్బ.. డిస్ట్రిబ్యూటర్‌ ప్రతీకారం

Update: 2018-11-04 11:14 GMT
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ నటించిన ‘సర్కార్‌’ చిత్రం దీపావళి సందర్బంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు కథ వివాదాస్పదం అవ్వడంతో విడుదలపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే రచయితల సంఘం మద్యవర్తిత్వంతో వివాదంకు తెర పడినది. కథ కాపీ వివాదం సర్దుమనిగిన తర్వాత సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడులో విజయ్‌ క్రేజ్‌ భారీగా ఉంటుంది. దాంతో ఆయన క్రేజ్‌ కు తగ్గట్లుగా భారీగా ఈ చిత్రంను ప్లాన్‌ చేస్తున్నారు.

తమిళనాడు మొత్తంలో 700 స్క్రీన్స్‌ కు పైగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక డిస్ట్రిబ్యూటర్‌ ‘సర్కార్‌’ పై ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఈ చిత్రం చంగల్‌ పేట్‌ ఏరియా డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ ను డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాత కాల్పతి అఘోరామ్‌ కోరుకున్నాడు. కాని సన్‌ నెట్వర్క్‌ వారు మాత్రం మరో డిస్ట్రిబ్యూటర్‌ కు ఆ రైట్స్‌ ను అమ్మడం జరిగిందట. దాంతో కాల్పతి సర్కార్‌ చిత్రంపై కోపం పెంచుకున్నాడు. తనకు రైట్స్‌ ఇవ్వనందుకు తన వద్ద ఉండే థియేటర్లలో ఆ చిత్రాన్ని ప్రదర్శించేందుకు నో చెబుతున్నాడు.

కాల్పతి తన పరపతిని ఉపయోగించి పలు థియేటర్లను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు ఆ థియేటర్లలో సర్కార్‌ సినిమా ప్రదర్శించేందుకు నో చెబుతున్నాడు. అదే జరిగితే ‘సర్కార్‌’ సినిమా ఓపెనింగ్స్‌ విషయంలో నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట. ఇతర డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలు కాల్పతితో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని సమాచారం అందుతుంది.

Tags:    

Similar News