ధనుష్ హీరోగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే హీరోగా ఆయన నటించిన సినిమాలు కొన్ని విడుదలకు సిద్దం అవుతుండగా.. ఇటీవలే ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సమయంలో ఈయన కొత్త సినిమాల ప్రకటనలు.. కొత్త సినిమాలకు చెందిన ఫస్ట్ లుక్ పోస్టర్ లు కూడా బ్యాక్ టు బ్యాక్ వచ్చి సందడి చేస్తూనే ఉన్నాయి.
తాజాగా ధనుష్ హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో నానే వరువెన్ అనే సినిమా రాబోతుందనే ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కళై పులి ఎస్ థాను ఈ సినిమాను వి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే సెల్వ రాఘవన్ ఈ సినిమాను తన గత చిత్రాల మాదిరిగానే చాలా విభిన్నంగా తెరకెక్కిస్తున్నట్లుగా ఈ పోస్టర్ ను చూస్తుంటే అర్థం అవుతుంది.
నానే వరువెన్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ధనుష్ లుక్ చూస్తుంటే మరోసారి ఆశ్చర్యం కలుగక మానదు. ఆయన కేవలం ఇరవై ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తున్నాడు. గతంలో మూడు పదుల వయసు లో 16 ఏళ్ల కుర్రాడిగా ధనుష్ కనిపించాడు. అందులో తన పాత్రకు పూర్తి న్యాయం చేసి అందరిని సర్ ప్రైజ్ చేసిన ధనుష్ ఇప్పుడు నానే వరువెన్ సినిమా పోస్టర్ లో కూడా కొత్తగా చాలా యంగ్ గా కనిపిస్తు అందరికి ఆశ్చర్యం కలిగేలా ఉన్నాడు.
ధనుష్ తెలుగు లో సార్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ధనుష్ చేస్తున్న మొదటి తెలుగు డైరెక్ట్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ధనుష్ ఈ సినిమా తో అక్కడ ఇక్కడ సక్సెస్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ధనుష్ హీరోగా బాలీవుడ్ సినిమా రూపొందుతూ ఉండగా.. ఆమద్య ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ లో కూడా నటిస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది.
వరుస సినిమాలు చేస్తున్న ధనుష్ నానే వరువెన్ సినిమాలో ఇలా ఇరువై ఏళ్ల కుర్రాడి కంటే మరింత చిన్న పాత్రలో కనిపించడం నిజంగా గొప్ప విషయం. ఇలా అత్యంత చిన్న వయసు కుర్రాడిగా కనిపించడం కేవలం ధనుష్ కు మాత్రమే చెల్లింది. ఇదే ధనుస్ అసురన్ సినిమా లో ఏకంగా 60 ఏళ్ల వయసు పాత్ర లో కనిపించిన విషయం తెల్సిందే. మొత్తానికి ధనుష్ కి మాత్రమే ఇలాంటి మేకోవర్ లు మరియు పాత్రలు సాధ్యం అంటూ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.