టాలీవుడ్ లో వున్న టాప్ హీరోల చుట్టూ కొంత మంది నిర్మాతల కోటరీలు వుండేవి. ఏ హీరోకు ఆ కోటరీ అన్నట్టుగా కొంత మంది నిర్మాతలు వుండేవారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేసే వాళ్లు బాలకృష్ణతో చేసే వారు కాదు.. ఈ ఇద్దరితో సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ నాగార్జున, వెంకటేష్ లతో చేసేవారు కాదు. అలా ఏ హీరోకు ఆ ప్రొడ్యూసర్స్ మాత్రమే సినిమాలు చేయాలని కొంత మంది గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి నచ్చిన హీరోతో మాత్రమే సినిమాలు చేయడం జరిగింది.
కానీ ఇప్పుడు కొంత మారింది. ఒకే హీరోతో సినిమాలు తీయాలని, వారితో తప్ప ఇతర హీరోలతో సినిమాలు చేయకూడదని కండీషన్స్ పెట్టుకోకుండా ఇతర ఒకే సారి నలుగురైదురు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పడు కూడా ఓ నిర్మాత ఒకే ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేయడానికి మాత్రమే ఆసక్తిని చూపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. కింగ్ నాగార్జున హీరోగా గతంలో శివప్రాదరెడ్డి సినిమాలు చేసేవారు.
ఫ్లాపులు, భారీ స్థాయిలో నష్టాలు ఎదుర్కొన్నా సరే తనతో మాత్రమే చివరి వరకు సినిమాలు తీస్తూ వచ్చారు. ఆ తరువాత అక్కినేని ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేస్తున్న నిర్మాతగా ఆ లిస్ట్ లో కొత్త నిర్మాత చేరుతున్నారు. ఆయనే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ అధినేతి శ్రీనివాస చిట్టూరి. రీసెంట్ గా రామ్ తో 'ది వారియర్' మూవీని నిర్మించిన ఆయన మరోసారి రామ్ తో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
సమంత నటించిన 'యూటర్న్' మూవీతో ప్రొడ్యూసర్ గా కెరీర్ ప్రారంబించిన శ్రీనివాస చిట్టూరి రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీకి చెందిన యువ హీరో నాగచైతన్యతో 'కస్టడీ' మూవీని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే కింగ్ నాగార్జున వందవ ప్రాజెక్ట్ ని కూడా శ్రీనివాస చిట్టూరినే నిర్మించబోతుండటం విశేషం. ఒకే సారి తనయుడు నాగచైతన్యతో తండ్రి నాగార్జునతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండటంతో శ్రీనివాస చిట్టూరిని అక్కినేని ఫ్యామిలీ ప్రొడ్యూసర్ అని పిలుస్తున్నారట.
ధమాకా, దాస్ కా ధమ్కీ సినిమాలకు కథ అందించిన రైటర్ బెజవాడ ప్రసన్నని ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక పరకటన త్వరలోనే రానుందని, నాగ్ వందవ సినిమా కావడంతో ఆ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకురానున్నారని తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.