ఎట్టకేలకు నయనతార-విగ్నేష్ శివన్ వివాహం బంధంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ జంట పెళ్లి చేసుకుంటుందా? లేక ప్రేమికులుగానే జీవితాంతం మిగిలిపోతారా? బ్రేకప్ తో మళ్లీ కొత్త ప్రయాణం మొదలు పెడతారా? ఇలా ఎన్నో రకాల సందేహాలు..విశ్లేషణలు ఏడేళ్ల ప్రేమ కాలంలో తెరపైకి వచ్చాయి. కానీ అన్నింటికి ఈ జంట నిన్నటితో చెక్ పెట్టేసింది.
వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక కొత్త కాపురం మొదలు పెట్టడమే ఆలస్యం. అయితే పెళ్లి చేసుకున్న సందర్భంగా ఈ జంట తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం ప్రశంసనీయం అని తెలుస్తుంది. ఇప్పటివరకూ ఏ సెలబ్రిటీ జంట చేయని అరుదైన ఘట్టానికి తెరలేపినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ జంట పెళ్లి సందర్భంగా ఏకంగా లక్ష మందికి తమిళనాడు వ్యాప్తంగా భోజనాలు ఏర్పాటు చేసారు.
అంతే కాదు 18000 మంది చిన్నారులకు ప్రత్యేకంగా విందు ట్రీట్ ఇచ్చారుట. ఈ నిర్ణయాన్ని నయన్-విగ్నేష్ శివన్ కలిసి తీసుకున్నారు. ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ 18000 మంది చిన్నారులు ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారో ముందుగానే పిల్లల చారటీ సంస్థల ద్వారా తెలుసుకుని రుచికరమైన వెజ్..నాన్ వెజ్ వంటకాలతో కడుపు నింపారు.
మిగతా లక్ష మంది కి అదే రేంజ్ లో భోజనాలు ఏర్పాటు చేసి తమ దాతృ హృదయాన్ని చాటుకున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఇది ఎంతో గొప్ప విషయం. ఒకేసారి ఇంత మందికి భోజనాలు ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటివరకూ చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళు జరిగాయి. కానీ ఇలా భోజన కార్యక్రమం నిర్వహించినట్లు ఎక్కడా బయటకు రాలేదు.
ఈ భోజన ఏర్పాట్లు నయన్ దంపతులు అభిమానుల కోసం కాకుండా..ఆకలితో అలమటించే వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గతంలో బిజినెస్ టైకూన్ ముకేష్ అంబానీ ఇంట పెళ్లి సందడిలో ఇలాంటి ఏర్పాట్లు కనిపించాయి. ఆ కుటుంబం అనాధ బాలలకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి స్వయంగా ఆ దంపతులే వడ్డించారు.
అంబానీ ఇంట పుట్టిన రోజు వేడుకలైనా ఇంతే ఘనంగా జరగుతుంటాయి. ఆ తర్వాత అనాద బాలలకు ఈ స్థాయిలో విందు ఏర్పాటు చేయడం అన్నది నయన్-విగ్నేష్ దంతపులకు చెల్లింది అన్న తీరున నిర్వహించడం విశేషం. ఈ విషయంలో కొత్త దంతపులు అభిమానుల్ని పక్కనబెట్టి సరైన పోషక ఆహారం దొరకని బాలల్ని ఎంపిక చేయడం విశేషం. ఆ రకంగా నయన్ -విగ్నేష్ ఎప్పటికీ అభిమానులకు గుర్తుండిపోతారు.