ఇవాళ ఏప్రిల్ 1. ఇకపై డిజిటల్ స్ట్రీమింగ్ శాటిలైట్ టెలికాస్ట్ కు సంబంధించి తెలుగు సినిమాలు ఖచ్చితంగా 8 వారాల గ్యాప్ ని పాటించి తీరాలనే నిబంధన అమలులోకి వచ్చింది. గత కొంత కాలంగా అమెజాన్ ప్రైమ్ చూపిస్తున్న దూకుడు వల్ల సినిమాలు ఇంకా హాళ్లలో ఆడుతుండగానే ఆన్ లైన్ లోకి వచ్చేస్తున్నాయి. దీని వల్ల వసూళ్లపై ఎంత లేదన్నా ప్రభావం పడుతోంది. ఈ విషయంగా డిస్ట్రిబ్యూటర్లు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అంతే కాదు టైటిల్స్ లోనే అమెజాన్ ప్రైమ్ లోగోలు పెట్టడం వల్ల పోస్టర్ లో చూసి ఇంకేం వెళ్తాము అనుకునే ప్రేక్షకులు ఉన్నారని వేరే రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 60 రోజుల తర్వాతే ఏ సినిమా అయినా హెచ్డి ప్రింట్ అందుబాటులోకి రానుంది. అయితే దీని వల్ల ఎంతమేరకు ప్రయోజనం ఉందన్నదే ప్రశ్నగా మిగులుతోంది
పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు ఇది ఖచ్చితంగా మేలు చేసేదే. అందులో అనుమానం లేదు. అలా కాకుండా యావరేజ్ అనో లేదా డిజాస్టర్ అయిన మూవీస్ కి రెండో వారం నుంచే థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వాటికి ఇప్పటిదాకా డిజిటల్ హక్కుల రూపంలో వచ్చే భారీ ఆదాయం నిర్మాతకు ఊరట కలిగించేది. ఇప్పుడు వ్యవధి పెరిగింది కాబట్టి అంత మొత్తం ఇవ్వలేమని సదరు సంస్థలు తెగేసి చెబుతాయి. ఆటోమేటిక్ గా ఇది వచ్చే సొమ్ముకు కోత పెడుతుంది.
పైగా చిన్న సినిమాలకు 60 రోజులు అనేది చాలా పెద్ద పీరియడ్. అంత వరకు శాటిలైట్ లో కూడా వేసుకోకపోతే ఆ టైం వచ్చే లోపు పబ్లిక్ కు దాని మీద ఆసక్తి పోవచ్చు. పెద్ద సినిమాలకు ఒక వ్యవధి చిన్న మూవీస్ కి మరోలా పెట్టి ఉంటే బాగుండేది అనే మాట వచ్చింది కానీ ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదు. ఇకపై జరగబోయే పరిణామాలను బట్టి ఈ 8 వారాల నిబంధన ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి