MaaElections ః విష్ణు కొత్త నినాదం అందరిని ఆకర్షిస్తోంది

Update: 2021-09-28 17:30 GMT
మా ఎన్నికల తేదీ దగ్గర పడింది. నామినేషన్ ల గడువు కూడా ముగింపుకు వచ్చింది. దాంతో పోటీ చేసేందుకు సిద్దం అయిన వారు అంతా కూడా నామినేషన్‌ వేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే కొందరు నామినేషన్‌ వేయడం జరిగింది. నేడు మంచు విష్ణు ప్యానల్‌ సభ్యులు నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన తర్వాత మంచు విష్ణు తన ప్యానల్‌ సభ్యులతో మీడియాతో మాట్లాడటం జరిగింది. సుదీర్ఘ సమయం మాట్లాడిన మంచు విష్ణు పలు విషయాల గురించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో కాకుండా తెలుగు సినిమా నిర్మాతల మండలి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. బండ్ల గణేష్ నైట్‌ పార్టీలు గిఫ్ట్‌ లు ఇస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ అడుగగా నేను రాత్రి 9 గంటల వరకు పండుకుంటాను. ఆ సమయంలో నేను నా పిల్లలను పడుకోబెట్టాల్సి ఉంటుంది. నేను ఎలా రాత్రి పార్టీలకు వెళ్తాను.. బహుమానాలు ఇస్తాను అన్నాడు. ఒక వేళ బండ్ల గణేష్‌ గారు బహుమానాలు ఇస్తే స్వీకరిస్తాను.. మా వారు కూడా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశాడు.

పవన్‌ కళ్యాణ్‌ గారి వ్యాఖ్యలను నిర్మాతల మండలి వ్యతిరేకించింది. అంటే సినిమా ఇండస్ట్రీ వారు అంతా పవన్ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. ఇప్పుడు ప్రకాష్‌ రాజ్ గారు సినిమా ఇండస్ట్రీ వైపు ఉంటారా లేదా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను సమర్థించి ఆయన వైపు ఉంటారా అనే విషయాన్ని తెలియజేయాలంటూ మంచు విష్ణు సూటిగా ప్రశ్నించాడు. పదే పదే తన మ్యానిఫెస్టో విడుదల తర్వాత ఖచ్చితంగా తనకే చిరంజీవి గారు మరియు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంటుందని.. ప్రతి ఒక్కరి మద్దతు నాకే ఉందని నేను భావిస్తున్నాను అంటూ మంచు విష్ణు చెప్పాడు. మా లో ఉన్న 900ల మంది సభ్యుల మద్దతు నాకు ఉండటం వల్లే నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను అన్నాడు. మీడియా వారు అడిగే ప్రశ్నలకు మంచు విష్ణు సమాధానాలు చెప్పాడు. ఆ సమయంలో ఒక జర్నలిస్ట్‌ ఎవరిది బలమైన ప్యానల్‌ అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో మంచు విష్ణు తో పాటు అంతా కూడా గట్టిగా మాదే అనేశారు.

మంచు విష్ణు పక్కనే ఉన్న బాబు మోహన్‌ స్పందించారు. ఈయన ఎగ్జిక్యూటివ్‌ వైస్ ప్రెసిడెంట్‌ గా పోటీ చేస్తున్నారు. ఎవరి ప్యానల్‌ బలమైనది అని అడిగిన సమయంలో బాబు మోహన్‌ స్పందిస్తూ మాదే బలమైన ప్యానల్‌. మాది తెలుగు ప్యానల్‌. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలిపే ప్యానల్ అన్నట్లుగా తెలుగు పదంను గట్టిగా ఒత్తి పలికినట్లుగా బాబు మోహన్‌ చెప్పారు. ఆ సమయంలో అంతా కూడా గట్టిగా తెలుగు వారి ఆత్మగౌరవ ప్యానల్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. ప్రత్యర్థి ప్రకాష్‌ రాజ్‌ తెలుగేతర సభ్యుడు కనుక ఆయన్ను టార్గెట్‌ చేస్తూ మాది తెలుగు వారి ఆత్మగౌరవ ప్యానల్‌ అంటూ బాబు మోహన్‌ వ్యాఖ్యలు చేయడం హాట్‌ టాపిక్ అయ్యింది. ఆ వ్యాఖ్యలు కాకతాళీయంగా వచ్చినవే అయినా కూడా ఇప్పుడు మంచు విష్ణుకు అవే మంచి ఆయుదాలు అవుతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచు విష్ణు యొక్క ప్యానల్‌ కొత్త నినాదం తెలుగు వారి ఆత్మగౌరవం ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 10 న జరుగబోతున్న మా సభ్యుల ఓట్లు ఎటు వైపు పడుతాయి.. ఎవరికి విజయాన్ని కట్టబెడతారు అనేది చూడాలి.
Tags:    

Similar News