తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన వాలిమై సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది అంటూ తమిళ బాక్సాఫీస్ వర్గాల వారు ప్రకటించారు. లాంగ్ రన్ లో ఈ సినిమా 200 కోట్ల వసూళ్లను దక్కించుకుంది అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.
వాలిమై రెండు వందల కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్లుగా వచ్చిన వార్తలను కొందరు కొట్టి పారేశారు. మొదటి వారంలో పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత పెద్దగా వసూళ్లను వాలిమై చిత్రం రాబట్టలేక పోయింది. కనుక 200 కోట్ల వసూళ్లు నమోదు అవ్వలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడు సినిమా వసూళ్లపై పెద్దగా స్పందించని చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా క్లారిటీ ఇచ్చారు.
అజిత్ అభిమానులకు వాలిమై కలెక్షన్స్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా రేపటి నుండి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న నేపథ్యంలో నిర్మాత బోనీ కపూర్ నుండి ఒక స్పష్టమైన క్లారిటీ అభిమానులకు దక్కింది. 200 కోట్ల కు పైగా వసూళ్లను దక్కించుకున్న వాలిమై సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది అంటూ ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.
సినిమా వసూళ్ల విషయమై గత కొన్ని రోజులుగా నెలకొన్ని సస్పెన్స్ కు తెర పడ్డట్లు అయ్యింది. అదుగో ఇదుగో అంటూ రకరకాల పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో తాజాగా వచ్చిన ఒక క్లారిటీ తో అజిత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ సినిమా 200 కోట్ల వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో తదుపరి సినిమా అంతకు మించి వసూళ్లు సాధించబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది.
బోణీ కపూర్ మరియు అజిత్ ల కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ ను దక్కించుకోవడం మాత్రమే కాకుండా పాజిటివ్ గా వసూళ్లను రాబట్టింది. కనుక వీరిద్దరి కాంబోలో మంచి సినిమాలు ముందు ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే అజిత్ కొత్త సినిమా అప్‌డేట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.