అర్జున్‌ రెడ్డి మళ్లీ వస్తాడట.. ఈసారి అంతకు మించి!

Update: 2022-04-12 05:31 GMT
దాదాపు అయిదు సంవత్సరాల క్రితం వచ్చిన అర్జున్‌ రెడ్డి ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ లో కబీర్ సింగ్‌ గా తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రీమేక్ అయిన అర్జున్ రెడ్డి అక్కడ కూడా భారీగానే వసూళ్లను దక్కించుకుంది. విడుదల అయిన ప్రతి చోట కూడా భారీగా విజయాలను సొంతం చేసుకున్న అర్జున్ రెడ్డి అనూహ్యంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.

తెలుగు వర్షన్‌ అర్జున్‌ రెడ్డిని రీ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా మొత్తం కూడా 4 గంటల 20 నిమిషాలు వచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు. దాన్ని చాలా ఎడిట్ చేయగా 3.45 నిమిషాలు వచ్చింది. అంత కూడా విడుదల చేయడం సాధ్యం కాక పోవడంతో మరో 45 నుండి 50 నిమిషాల సినిమాను ఎడిట్‌ చేశాం.

ఇప్పుడు సినిమా విడుదల అయ్యి 5 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఆ ఎడిట్‌ చేసిన వర్షన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా దర్శశకుడు సందీప్‌ స్వయంగా ప్రకటించాడు. ఎడిట్‌ చేయడానికి ముందు దాదాపుగా నాలుగు గంటల సినిమా ఉంది. కనుక ఆ మొత్తంను ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ ఆయన తెలియజేయడం తో చర్చనీయాంశం అయ్యింది.

అర్జున్‌ రెడ్డి రా వర్షన్ ను ఓటీటీ ద్వారా తీసుకు వస్తారా లేదంటే మరేదైనా మార్గం ద్వారా తీసుకు వస్తారా అనేది చూడాలి. థియేటర్‌ రిలీజ్ అంటే అన్ని గంటలు ఖచ్చితంగా వర్కౌట్‌ అవ్వదు. కనుక ఓటీటీ లేదా మరేదైనా మార్గం ద్వారా ఆ ఒరిజినల్‌ వర్షన్ అర్జున్‌ రెడ్డిని విడుదల చేయాల్సిందే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టు 25వ తారీకున ఈ సినిమా విడుదల అయ్యి అయిదు సంవత్సరాలు కాబోతుంది. ఆ సమయంలోనే ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు మళ్లీ తీసుకు వస్తామంటూ అర్జున్‌ రెడ్డి మేకర్స్ ప్రకటించడంతో అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అర్జున్‌ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ట్రెండ్‌ సెట్టర్ మూవీ. ఆ సినిమాలోని ప్రతి ఒక్క సన్నివేశం కూడా యూత్‌ ఆడియన్స్ కు బాగా కనెక్ట్‌ అయ్యాయి.

ఇప్పుడు రా వర్షన్‌ రిలీజ్ చేస్తే అందులో మరెంత బోల్డ్‌ కంటెంట్‌ ఉంటుందో... ఎంత మేరకు అది సెన్సార్‌ కు లోబడి ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. సెన్సార్‌ లేకుండానే రా వర్షన్ విడుదల అయ్యే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా అర్జున్ రెడ్డి అంతకు మించి అన్నట్లుగా ఈసారి కూడా ఆకట్టుకుంటుందని యూత్‌ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News