ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజమౌళి చిత్రం `ఆర్ ఆర్ ఆర్` బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. 1000 కోట్ల వసూళ్లతో `బాహుబలి ది కనుక్లూజన్` తర్వాత రెండవ స్థానాని దక్కించుకుంది. ఇండియన్ సినిమా రికార్డుల గురించి మాట్లాడుకోవాల్సిన వచ్చిన ప్రతీ సందర్భంలోనూ `బాహుబలి`తో పాటు `ఆర్ ఆర్ ఆర్` ప్రస్తావన కూడా తప్పనిసరి అని జక్కన్న అండ్ కో ప్రూవ్ చేసింది.
అయితే `ఆర్ ఆర్ ఆర్` అన్నది చరిత్ర కాదు..చరిత్ర కారుల కథ కాదు. కేవలం గోండు వీరుడు కొమరంభీమ్...స్వాత్రత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేర్లు మాత్రమే వాడుకుని తెరకెక్కించిన చిత్రం అన్నది సుస్పష్టం. ఇది పక్కా కమర్శియల్ స్టోరీ. బ్రిటీష్ నేపథ్యం సెట్లను అద్భుతంగా వేసి..దాని చుట్టూ భారత్ వ్యతిరేక కథని అల్లి తీసిన సినిమా మాత్రమేనని ఓ సెక్షన్ నుంచి రిలీజ్ అనంతరం వ్యతిరేకత కూడా వ్యక్త మవుతోంది.
చరిత్ర తెలిసిన వారు.. సినిమాని అనర్ఘళంగా విశ్లేషించిన మేథావులు ఇదేమి అంత గొప్ప కథ కాదని నిర్మోహమాటంగా చెబుతున్నారు. ఇక ఇందులో ఎన్టీఆర్ పాత్రని తక్కువ చేసి చూపించారని అభిమానులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ తలుపుల్ని సైతం బద్దలు కొట్టారంటే? వాళ్ల అవేశాన్ని అర్ధం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి ఒకానోక సందర్భంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదనలో అర్ధం ఉందనిపిస్తుందలని మెజార్టీ వర్గం భావించింది.
చరణ్ పాత్రకి ధీటుగా తారక్ పాత్రని తీర్చి దిద్దలేదన్నది అభిమానులు అసంతృప్తి. మరి ఇప్పుడు వీటిపై జక్కన్న అండ్ కో రివ్యూ చేస్తుందా? అసలు ఎందుకు వ్యతిరేకత వచ్చింది? అన్న దానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. సాధారణంగా రాజమౌళి..రమా..కార్తికేయ సినిమా రిలీజ్ అయి హిట్ అందుకున్న తర్వాత ఇంట్లో అదే సినిమాని పదే పదే చూస్తారుట. సినిమా హిట్ అయిన అందులో ఇంకా లోపాలు ఏమైనా ఉన్నాయా? అని పిన్ టూ పిన్ వెదుకుతారుట.
వాటిని గుర్తించి తదుపరి సినిమాలో రిపీట్ అవ్వకుండా చూసుకుంటారుట. `బాహుబలి` రిలీజ్ తర్వాత ఆ సినిమాని చాలాసార్లు చూసి ఇలాగే విశ్లేషించారుట. ఇప్పుడు `ఆర్ ఆర్ ఆర్` విషయంలోనూ జక్కన్న ఫ్యామిలీ మొత్తం అదే పనిమీద ఉందని సమాచారం. పనిలో పనిగా ఎన్టీఆర్ పాత్ర విషయంపై కూడా రివ్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. అయినా సినిమా తీసిన వాళ్లకు తెలియదంటారా? ఎవర్నీ లేపారు? ఎవర్నీ తొక్కారు? అన్నది.